- District News
- రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.మండల అధ్యక్షులు సమ్మిగ...
రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.మండల అధ్యక్షులు సమ్మిగౌడ్..
లోకల్ గైడ్ ఆగస్టు 20 కేసముద్రం మండలం
రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగించాలి - Amc చైర్మన్ గంట, మండల అధ్యక్షులు సమ్మిగౌడ్..
కేసముద్రం మున్సిపాలిటీ మార్కెట్‌లో *మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధానమంత్రి, యువ నాయకుడు రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ... యువతపై నమ్మకంతో ఓటు హక్కు వయసును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించి ప్రజాస్వామ్యంలో యువతకు భాగస్వామ్యం కల్పించారని తెలిపారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం,నూతన విద్యా విధానం, ఐటీ, సాంకేతిక రంగాల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు.అత్యంత చిన్న వయస్సులోనే ప్రధాని అయ్యిన ఘనత మన రాజీవగాంధీ గారిది అని,దేశ అభివృద్ధి, పేదల సంక్షేమం, యువతకు అవకాశాల కల్పనలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆధునిక భారత నిర్మాణంలో ఆయన చూపిన దూరదృష్టి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. శ్రీలంకలో శాంతి స్థాపనకు కృషి చేసిన రాజీవ్ గాంధీ 1991లో శ్రీపెరంబుదూరులో ఎల్‌టీటీఈ మానవ బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు.నవ భారత నిర్మాణానికి కంప్యూటర్ యుగాన్ని పరిచయం చేసి ఈ రోజు భారతదేశ యువత ప్రపంచ నలుమూలల అగ్రగామి లో ఉండేలా చేసిన ఘనత రాజీవ్ గాంధీ అని గుర్తుచేశారు..
రాజీవ్ గాంధీ గారి ఆశయాలు, సద్భావన, ఐక్యత, యువత సాధికారతను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు,మున్సిపల్ చైర్‌పర్సన్ సునీత వెంకన్న , PACS వైస్ చైర్మన్అంబటి మహేందర్ రెడ్డి , కౌన్సిలర్లు వల్లందాసు ఉమా రవి,సునీత బధ్యనాయక్, రాంబాబు, రడం వెంకన్న, రడం శ్రీనివాస్, తరాల వీరేష్, దామరకొండ ప్రవీణ్, సామల నర్సయ్య,వసంత రావు,ఆరిద్రపు కుమార్, పార్వతి, ప్రభావతి,మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు,గ్రామ పార్టీ అధ్యక్షులు,ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ శాఖ నాయకులు, యువజన, మహిళా కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు, పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
