- District News
- మహబూబాబాద్ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు -
మహబూబాబాద్ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు -
గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్
మహబూబాబాద్, సెప్టెంబర్ 05 :
మహబూబాబాద్ లోని గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయుని ప్రాముఖ్యత, ఉపాధ్యాయుని జీవితం, సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర గురించి వివరించారు. గురువు లేనిదే డాక్టర్ లేడు, గురువు లేనిదే ఇంజనీర్ లేడు అని, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుని పాత్ర ఎంతో కీలకమని తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ శ్రీ కోనకంచి రామకృష్ణ మరియు మమత హాజరై విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుని ప్రధాన పాత్ర ఏమిటి, సమాజంలో గురువుకు ఉన్న గౌరవం ఏమిటో చక్కగా వివరించారు.
అనంతరం ఉపాధ్యాయులందరూ తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. విద్యార్థులు కూడా ఉపాధ్యాయుల పట్ల తమకున్న గౌరవాన్ని తెలియజేస్తూ ప్రతిజ్ఞ చేశారు. ఇకపై క్రమశిక్షణతో ఉంటామని, తల్లిదండ్రులను, పెద్దలను గౌరవిస్తామని పరమ ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నరసింహారావు వైస్ ప్రిన్సిపాల్ ప్రియాంక సర్కార్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది అందరూ పాల్గొన్నారు అనంతరం పాఠశాలలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి
బహుమతులు అందజేశారు. వేడుకలు అత్యంత ఉత్సాహంగా, ఆనందంగా ముగిశాయి.
