- District News
- పార్టీకి నష్టం కలిగిస్తున్న "నాసర్"పై చర్యలు తీసుకోవాలి.
పార్టీకి నష్టం కలిగిస్తున్న "నాసర్"పై చర్యలు తీసుకోవాలి.
పార్టీ కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ ఆరోపణలు.
లోకల్ గైడ్ /తాండూర్:
కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తూ, పార్టీలో అనవసర వివాదాలకు కారణమవుతున్నారని ఇందిరమ్మ కాలనీకి చెందిన నాసర్‌పై చర్యలు తీసుకోవాలని ఆ వార్డు ఇన్‌చార్జి సాయప్ప, మాజీ కౌన్సిలర్ వెంకన్న గౌడ్, పలువురు స్థానిక మహిళా నాయకులు పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
"నాసర్" కాంగ్రెస్ పార్టీ నాయకుడినంటూ చెప్పుకుంటూ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. గత ఎమ్మెల్యే, ఎంపీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించారని పేర్కొన్నారు. ఇప్పుడేమో
వార్డు కమిటీల ఏర్పాటుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు .ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు తాండూర్ పట్టణంలో చేపడుతున్న వార్డు కమిటీల ఏర్పాటుకు నాసర్ అడ్డంకులు సృష్టిస్తున్నారని వారు ఆరోపించారు. ఒకే వార్డులో రెండు కమిటీలు ఏర్పాటు చేయాలంటూ వివాదానికి తెరలేపుతున్నారని, పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలపై అనవసర ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు.పార్టీలో అంతర్గతంగా సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉండగా, బహిరంగంగా వివాదాలు సృష్టించడం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే అధిష్ఠానం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
నాసర్ వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయనున్నట్లు వార్డు ఇన్‌చార్జి సాయప్ప, మాజీ కౌన్సిలర్ వెంకన్న గౌడ్ తెలిపారు.
