- District News
- కమిటీలే కాంగ్రెస్ పార్టీకి పునాది.
కమిటీలే కాంగ్రెస్ పార్టీకి పునాది.
- క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి:
లోకల్ గైడ్/ తాండూర్:
గ్రామ కమిటీలే కాంగ్రెస్ పార్టీకి పునాదులు అని డిసిసి అధ్యక్షులు ధారాసింగ్ అన్నారు. గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దేముల్ మండలం జైరామ్ తండా, ఇందూరు గ్రామాల్లో కొనసాగుతున్న బూత్, విలేజ్ కమిటీల నియామక ప్రక్రియను వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు జాదవ్ ధారాసింగ్ నాయక్ పరిశీలించారు. ఈ మేరకు,నూతనంగా నియమితులైన బూత్, విలేజ్ కమిటీ అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జాదవ్ ధారాసింగ్ నాయక్ మాట్లాడుతూ... పార్టీకి బూత్, విలేజ్ స్థాయి కమిటీలే పునాది అని అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు.కాగా కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేస్తే పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు నర్సిరెడ్డి, కార్యవర్గ సభ్యులు గోపాల్, ఏ-బ్లాక్ అధ్యక్షులు లొంక నర్సింలు, సర్పంచుల సంఘం అధ్యక్షులు నారాయణ గౌడ్, గ్రామ సర్పంచ్ వెంకట్,సీనియర్ నాయకులు మల్లేశం, శ్రీనివాస్ రెడ్డి, శంకర్, రియాజ్, నర్సింలు, జగన్, శ్రీనివాస్, గ్రామ కమిటీ అధ్యక్షులు చంద్రశేఖర్, సర్పంచులు సురేష్, రాములు, యువ నాయకులు మహేష్, శ్రావణ్, హర్షవర్ధన్, శాంత్, నరేష్ తదితర గ్రామ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
