వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ ప్రదేశంలో నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం

వికాస తరంగిణి ఖమ్మం జిల్లా అధ్యక్షులు పోలా శ్రీనివాసరావు

Published On
వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ ప్రదేశంలో నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం

 

 

ఖమ్మం : లోకల్ గైడ్:

నగరంలోని కొత్తగూడెం – అల్లిపురం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు వికాస తరంగిణి ఖమ్మం బృందం ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు పోలా శ్రీనివాసరావు తెలిపారు . ఈ నెల 12న ఆలయ శంకుస్థాపన సందర్భంగా ఉదయం 7 నుంచి 9.30 గంటల వరకు సుమారు 200 మంది భక్తులతో 11 సార్లు సహస్రనామ పారాయణం నిర్వహించినట్లు పేర్కొన్నారు . ఆలయ నిర్మాణం పూర్తై విగ్రహ ప్రతిష్ఠ జరిగే వరకు ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని వెల్లడించారు . భక్తులు , ఆసక్తి ఉన్నవారు ఈ సామూహిక పారాయణంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు . పుట్టినరోజులు , వివాహ వార్షికోత్సవాల సందర్భంగా కుటుంబ సమేతంగా పాల్గొనవచ్చని తెలిపారు . ఆసక్తి ఉన్నవారు ఖమ్మం జిల్లా పరిషత్‌ సెంటర్‌లోని పోలా జ్యూస్‌ లేదా వికాస తరంగిణి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు .

Tags:

About The Author

Latest News

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
సుల్తానాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ
మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి
అమర పోలీసు వీరులకు ఘన నివాళి: వికారాబాద్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో బృహత్ రక్తదాన శిబిరం
_దుబాయ్ వ్యాపార పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న ఎస్‌ఎల్‌ఎన్ గ్రూప్ ప్రతినిధులు
త్రోబాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా రవికుమార్. క్రీడాకారుల ప్రోత్సాహమే లక్ష్యం..
గుడిపూడి తిరుమల రావు జన్మదిన వేడుకల్లో రామకృష్ణాపురం యూత్ సందడి!
ఘనంగా 'అమ్మ రక్షక పురస్కారం' ప్రదానం.. విశేష సేవలందించిన సిఐ రాజశేఖర్ రెడ్డి కి సత్కారం.