డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ట్రాఫిక్ పోలీసుల కొరడా

174 మందికి రూ.5.76 లక్షల జరిమానా.. మద్యం సేవించి వాహనాలు నడిపిన 99 మంది పట్టివేత

Published On
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ట్రాఫిక్ పోలీసుల కొరడా

సిద్దిపేట, సెప్టెంబర్ 5(లోకల్ గైడ్):

మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడంపై సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. గత కొన్ని రోజులుగా ట్రాఫిక్ సీఐ చెట్టుక్రింది ముత్యం రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో మొత్తం 174 మంది వాహనదారులు పట్టుబడ్డారు.వారిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 99 మందిని ఈ వారం సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరుపరిచారు. కేసులను విచారించిన న్యాయమూర్తి 99 మందికి కలిపి రూ.3,45,500 జరిమానా విధించారు.అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన 75 మందికి రూ.2,31,000 జరిమానా విధించారు. మొత్తం 174 కేసుల్లో రూ.5,76,500 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ చెట్టుక్రింది ముత్యం రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల వాహనదారుల ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు.రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ బాధ్యత కలిగిన పౌరులుగా వ్యవహరించాలని సీఐ కోరారు.

Tags:

About The Author

Latest News