- District News
- Warangal
- పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలి.
పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలి.
Published On
By Ram Reddy
హనుమకొండ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 09
(లోకల్ గైడ్ న్యూస్)
పరీక్ష నిర్వహణలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. పరీక్షా గదుల నిర్వహణ, తాగునీరు, విద్యుత్, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు.
అదేవిధంగా కలెక్టరేట్ లోని పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ ను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమును కలెక్టర్ పరిశీలించారు.వాటికి సంబంధించిన వివరాలను జిల్లా ఖజానా అధికారి శ్రీనివాస్ కుమార్, కలెక్టరేట్ పరిపాలన అధికారి గౌరీ శంకర్ కలెక్టర్ కు వివరించారు.
హనుమకొండ సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎన్డీఏ, నావల్ అకాడమీ పరీక్ష ఈనెల 13న ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, అదేవిధంగా వడ్డేపల్లి లోని పింగళి ప్రభుత్వ బాలికలడిగ్రీ,పీజీ కళాశాలలో సిడిఎస్ పరీక్ష ఉదయం 9 నుండి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12:30 నుండి 2:30 గంటల వరకు, సాయంత్రం 4 నుండి6 గంటల వరకు పరీక్ష జరుగుతుందని అధికారులు తెలిపారు.
తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్
పింగిళి ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలను సందర్శించిన కలెక్టర్ కళాశాలలోని తరగతులైన పరిశీలించారు.బీసీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులతో కలెక్టర్ మాట్లాడారు. చదువులు పూర్తయిన వెంటనే పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని, సాఫ్ట్వేర్ రంగంలోనూ ఉద్యోగాలు సాధించాలని విద్యార్థినులకు సూచించారు.
కళాశాలలో విద్యార్థినుల సంఖ్య, బోధన, బోధనేతర సిబ్బంది వివరాలను, మౌలిక వసతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
21 Sep 2026 21:45:01
. వాజేడు,లొకల్ గైడ్ ప్రతినిధి :- ములుగు జిల్లా వాజేడు మండలం లోని ప్రభుత్వ స్కూల్స్ మండల పరిషత్, జిల్లా పరిషత్, ఉన్నత పాఠశాలలకు,ఆశ్రమ పాఠశాలలకు
