రాష్టాన్ని  సంక్షోభం లోకి నెట్టిన అసమర్థ కాంగ్రేస్   ప్రభుత్వం .

బీఆర్ ఎస్  పథకాలకు మంగళం పాడారు. ---  రేవంత్ ప్రభుత్వం పతనం కావడం తధ్యం.

కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం.          --- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి .
Published On
రాష్టాన్ని  సంక్షోభం లోకి నెట్టిన అసమర్థ కాంగ్రేస్   ప్రభుత్వం .

వనపర్తి లోకల్ గైడ్ ప్రతినిధి సెప్టెంబర్ 8:
     
 రాష్ట్రాన్ని   సంక్షోభం లోకి నెట్టిన అసమర్థ కాంగ్రేస్ 
 ప్రభుత్వం పతనం కావడం ఖాయమని మాజీ  మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నివాస  గృహంలో  రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు ఇంతియాజ్ ఇసాక్ తో కలసి విలేకర్ల తో మాట్లాడుతూ 6గ్యారంటీలు ,13డిక్లరేషన్లు, 420హామీలు, నూరు రోజుల్లో ఇస్తామని వెయ్యి రోజులైనా అమలు చేయలేదన్నారు. రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన మోసపూర్తి హామీలను నమ్మి  ప్రజలు నేడు హరిగోస పడుతున్నారన్నారు. ఇచ్చిన  హామీలను అమలు చేయలేకపోవడం వల్ల బీఆర్ఎస్  8రోజుల నిరసన కార్యక్రమం చేపట్టగా లక్షలాదిగా  ప్రజలు రోడ్ల మీదికి వచ్చి ప్రభుత్వంపై తమ నిరసన వ్యక్తం చేశారన్నారు.  ప్రతిపక్ష పాత్రIMG-20260908-WA0151 సమర్థవంతంగా పోషించడం జరిగిందన్నారు. సంపూర్ణమైన క్యాబినెట్ లేని ప్రభుత్వంగా చరిత్రలో నిలిచింద న్నారు. విద్యాశా ఖ ఘోరంగా విఫలమైందన్నారు. పాలిటెక్ని క్ 97జి.ఓ ఎత్తివేయాలని ఆయన  డిమాండ్ చేశారు. 
 గురుకులాలలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
ఆకునూరి మురళి కమిషన్  నివేదిక అమలు చేయలేక బుట్ట దాఖలు చేసిందన్నారు. హోం, మునిసిపల్, విద్యా శాఖలను దగ్గర పెట్టుకొని విపరీతమైన అవినీతి పాల్పడుతున్నాడని ఆయన  ఆరోపించారు.కాంగ్రేస్ అంతర్గత కుమ్ములాటలతో అభివృద్ధి పాతాళం లోకి పోయిందని ఆయన ఎద్దేవా చేశారు . రైతుల సంక్షేమం గాలికి వదిలేయడంతో 
ఒక్క యూరియా బస్తా కోసం రోడ్లపై పడిగాపులు కాస్తున్నారని ఆయన  చెప్పారు. యూరియా యాప్ ద్వారా రైతుల నోట్లో మట్టి కొట్టారని, పెంచుతామన్న రైతు బంధుకు దిక్కులేదని,రైతు భీమాకు మంగళం పాడారని ఆయన ద్వజమెత్తారు. 

---- హామీలు అడిగితే అక్రమ అరెస్టులా..?

హైదరాబాద్ లో బీ ఆర్ ఎస్ నాయకుల అరేస్ట్ కు నిరసనగా వనపర్తి అంబేద్కర్ చౌరస్తాలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఈ ధర్నా నుదేశించి మాట్లాడుతూ  కాంగ్రేస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతే అరేస్ట్ చేయడం దారుణమన్నారు. మహిళా ఎమ్మెల్యేలను అవమానించిన రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు అక్రమంగా అరెస్టు చేసిన ఎంఎల్ ల్సీ  లను భేషరతుగా విడుదల చేయాలన్నారు . అసెంబ్లీ సాక్షిగా నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ప్రజాస్వామ్యానికి మచ్చ న్నారు. ప్రజాస్వామ్యంలో చీకటిరోజులని మాజీ మంత్రి నిప్పులు చెరిగారు.అక్రమంగా అరెస్టు చేసిన ఎంఎల్ ల్సీ తాత మధు ,నవీన్ రెడ్డిలను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నాలో బీ ఆర్ ఎస్ నాయకులు ప్లే కార్డులు పట్టుకుని నిరసన తెలుపుతూ ధర్నా చేశారు. ఈ దర్నా లో 
 గట్టు యాదవ్, బి.లక్ష్మయ్య, వాకిటిశ్రీధర్, పలుసరమేష్ గౌడ్, గంధం.పరంజ్యోతి, సుగూర్ రాము, వేణుగోపాల్ త దితరులు పాల్గొ న్నారు.

Tags:

About The Author

Latest News

మహిళా ప్రజాప్రతినిధులపై నిర్బంధమా? మహిళా ప్రజాప్రతినిధులపై నిర్బంధమా?
​రింగ్ రోడ్ కూడలిలో ఉద్రిక్తత.. అడ్డుకున్న పోలీసులతో నేతల వాగ్వాదం ​అంబేద్కర్ సాక్షిగా కాంగ్రెస్ ప్రజావ్యతిరేక పాలనపై నిరసన గళం
స్పీకర్‌పై నోరు పారేసుకుంటే.. చట్టం ఊరుకోదు!...అజ్మీర నరేష్ కుమార్ డిమాండ్ 
రైతు వేదికలో సన్న రకాల వరి సాగు నమోదు పత్రాల స్వీకరణ
రాష్టాన్ని  సంక్షోభం లోకి నెట్టిన అసమర్థ కాంగ్రేస్   ప్రభుత్వం .
మట్టి వినాయకుడినే పూజిద్దాం.. ప్రకృతిని కాపాడుదాం!”
దళిత వ్యతిరేకి బీ ఆర్ ఎస్ పార్టీ...అధికారం కోల్పోయామనే అక్కసుతో దళితుల పట్ల సంస్కార హీనంగా ప్రవర్తించిన బిఆర్ఎస్ ఎంఎల్సీ తాత మధు.
7వ వార్డులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ