గుడిపూడి తిరుమల రావు దశదినకర్మకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ హాజరు

వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

Published On
గుడిపూడి తిరుమల రావు  దశదినకర్మకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ హాజరు

 

 

కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 6, లోకల్ గైడ్ న్యూస్ :

కాంగ్రెస్ నాయకులు గుడిపూడి తిరుమల రావు తాతయ్య, గేట్ కారేపల్లి గ్రామానికి చెందిన దుగ్గినేని వెంకటేశ్వర్లు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన దశదినకర్మ కార్యక్రమం ఆదివారం గేట్ కారేపల్లిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ హాజరై వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వెంకటేశ్వర్లు మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ, వెంకటేశ్వర్లు మృతి కుటుంబానికి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూరి రాంబాబు, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు కుమారులు దుగ్గినేని రామారావు , సత్యనారాయణ , కోటయ్య , కాంగ్రెస్ నాయకులు ఉమాశంకర్, విష్ణువర్ధన్ రెడ్డి , గుడిపూడి నర్సయ్య, చెరుకూరి వెంకటేశ్వర్లు, జక్కుల కుమార్, సర్పంచ్ పూసం ఎల్లయ్య, ఈసం మోతి వీరాస్వామి, డేగల ఉపేందర్, కడియాల సుధాకర్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూక్య రంజిత్ కుమార్, షేక్.హాజిమియా,వరికొర్ల వీరభద్రం, సామినేని తిరుపతిరావు, కుమారస్వామి, భూషణం ఎల్లయ్య , మాలి వీరస్వామి, బాణోత్ నాయక్, బానోత్ వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News