- District News
- సీతక్క చొరవతో లక్నవరం నీళ్లు.. రైతుల పాలాభిషేకం
సీతక్క చొరవతో లక్నవరం నీళ్లు.. రైతుల పాలాభిషేకం
రైతుల పంటలను కాపాడేందుకు సాగునీరు విడుదల.. అశోక్ సహకారంతో గోవిందరావుపేటలో అభివృద్ధికి పెద్దపీట
గోవిందరావుపేట ములుగు జిల్లా (లోకల్ గైడ్ )
గోవిందరావుపేట: రైతుల సమస్యలను తన సమస్యలుగా భావించి తక్షణమే స్పందించే మంత్రి దనసరి అనసూయ సీతక్క చొరవతో గోవిందరావుపేట మండలంలోని రైతుల పంటలను కాపాడేందుకు లక్నవరం సరస్సు నుంచి సాగునీటిని విడుదల చేయించినట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ సహకారంతో రైతుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపించామని అన్నారు.
గత పది రోజులుగా రంగాపురం, శ్రీరాంపతి, నరసింహుల కాలువ, కోట కాలువ పరిధిలోని రైతులు పంటలకు నీరు అందించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుల ద్వారా మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారని తెలిపారు. దీనిపై స్పందించిన సీతక్క నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో, సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే నీటిని విడుదల చేయించారని చెప్పారు.
సాగునీటి విడుదలతో పంటలు ఎండిపోకుండా ఉపశమనం లభించడంతో రైతులు, కాంగ్రెస్ నాయకులు మంత్రి సీతక్క , ఉత్తమ్ కుమార్ రెడ్డి , జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడాకుల అశోక్ పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల కష్టాలను అర్థం చేసుకుని స్పందించిన నాయకత్వానికి ఇది రైతుల కృతజ్ఞతకు నిదర్శనమని వెంకటకృష్ణ అన్నారు.
గోవిందరావుపేట అభివృద్ధికి రూ.25 కోట్ల నిధులు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో గోవిందరావుపేట మండల అభివృద్ధికి సుమారు రూ.25 కోట్ల నిధులు తీసుకువచ్చినట్లు వెంకటకృష్ణ తెలిపారు. గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీలు, మౌలిక వసతులు, కమ్యూనిటీ హాళ్లు, గృహ నిర్మాణాలు తదితర పనులకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.
చల్వాయి గ్రామంలో వడ్రంగి, గోసంగి సంఘాలకు కమ్యూనిటీ హాళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని, గోవిందరావుపేట, చల్వాయి, పస్రా ప్రాంతాల్లో వివిధ కుల సంఘాలు, ప్రజలు కోరిన కమ్యూనిటీ హాళ్లకు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. రాబోయే రోజుల్లో నిధులు మంజూరు చేయించి నిర్మాణ పనులు చేపడతామని చెప్పారు. పేదల గృహ నిర్మాణాలతో పాటు మసీదుల అభివృద్ధికి కూడా ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందన్నారు.
కొత్త రేషన్ కార్డులు.. సన్నబియ్యం పంపిణీ
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని వెంకటకృష్ణ తెలిపారు. గోవిందరావుపేట మండలంలో 1,435 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందన్నారు. కొత్త రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు నిత్యావసర సరుకులు, సన్నబియ్యం వంటి సంక్షేమ ప్రయోజనాలు అం
దుతున్నాయని చెప్పారు.
రైతులకు రుణమాఫీ.. రైతు భరోసా
రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ, రైతు భరోసా వంటి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. గోవిందరావుపేట మండలంలో దాదాపు 90 శాతం మంది అర్హులైన రైతులకు రుణమాఫీ ప్రయోజనం అందిందని తెలిపారు. సాంకేతిక కారణాలతో మిగిలిన రైతులకు ఎదురైన సమస్యలను కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
పేదల సొంతింటి కలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండ
బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం ప్రజలు ఎదురుచూశారని వెంకటకృష్ణ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోవిందరావుపేట మండలంలో 515 ఇళ్లకు మంజూరు చేశామని, రెండో దశలో మరో 300 ఇళ్లను మంజూరు చేసేందుకు మంత్రి సీతక్క నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
పేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులతో పాటు పేదల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు.
గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని పాలడుగు వెంకటకృష్ణ అన్నారు.
“పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గోవిందరావుపేట మండలానికి ఏం చేశారు? కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో ఏం చేసిందో ప్రజల కళ్ల ముందే ఉంది. రైతులకు లక్నవరం నీళ్లు తెచ్చాం.. కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం.. రుణమాఫీ అమలు చేశాం.. పేదలకు ఇళ్లు మంజూరు చేశాం.. కమ్యూనిటీ హాళ్లకు నిధులు తీసుకొస్తున్నాం.. గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నాం.”
మంత్రి సీతక్క ప్రజా నాయకత్వం, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడాకుల అశోక్ చొరవ, సహకారంతో గోవిందరావుపేట మండలానికి మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని పాలడుగు వెంకటకృష్ణ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కార్మిక శాఖ అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య, సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, సీనియర్ నాయకులు కనతల నాగేందర్ రావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారామ్ నాయక్, జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు చింత క్రాంతి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు భైరి అభిలాష్, మాజీ ఎంపీటీసీలు చాపల ఉమాదేవి, గుండెబోయిన నాగమణి - అనిల్ యాదవ్, కాడబోయిన రవి, జిల్లా కార్యదర్శి సూదిరెడ్డి జనార్ధన్ రెడ్డి, జంపాల చంద్రశేఖర్, భూక్య రాజు తో పాటుగా మండల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యువజన నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొన్నారు.
