- District News
- దేశభక్తిని చాటుతూ జనగామలో ఘనంగా తిరంగా ర్యాలీ
దేశభక్తిని చాటుతూ జనగామలో ఘనంగా తిరంగా ర్యాలీ
79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొ
ని భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా ఆధ్వర్యంలో, జనగామ పట్టణ అధ్యక్షులు బొమ్మకంటి అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం జనగామ పట్టణంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. నెహ్రూ పార్క్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ జాతీయ జెండాలను చేతబూని, దేశభక్తి నినాదాలతో చౌరస్తా వరకు ఉత్సాహంగా కొనసాగింది.
ఈ కార్యక్రమానికి బీజేపీ ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు సౌడ రమేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ సమగ్రత, ఐక్యత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.
తిరంగా ర్యాలీ ద్వారా దేశభక్తి, జాతీయ ఐక్యత మరియు ‘దేశం ముందు – పార్టీ తరువాత’ అనే స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం అనేది ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమని, వారి త్యాగాలను నేటి యువత ఎప్పటికీ మరువకూడదని అన్నారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం మరియు జాతీయ సమైక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా, పట్టణ నాయకులు, ముఖ్య నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు, యువకులు మరియు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని తిరంగా ర్యాలీని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కే వి ఎల్ ఎన్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విద్య సాగర్ రెడ్డి శివరాజ్ యాదవ్ రాష్ట్ర నాయకులు సురేష్ గౌడ్ ఉడుగుల రమేష్ bjym జిల్లా అధ్యక్షులు హరీష్ యాదవ్
మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జీవనజ్యోతి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ఉమారాణి అంజిరెడ్డి జిల్లా నాయకులు వారణాసి పవన్ శర్మ దేవరయ ఎల్లయ్య జే ఆర్ వీ ఎన్ రెడ్డి పట్టణ నాయకులు పెద్దోడు జగదీష్ దూసర శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు
