చిన్నారి మహేష్‌కు ‘మీకోసం మేమున్నాం’ టీం ఆర్థిక చేయూత

Published On
చిన్నారి మహేష్‌కు ‘మీకోసం మేమున్నాం’ టీం ఆర్థిక చేయూత

 

చర్ల :  లోకల్ గైడ్ న్యూస్ :
చర్ల మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన గగనం రాజు కుమారుడు గగనం మహేష్ (10) చిన్న వయసులోనే కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నాడు. అనంతరం ఏర్పడిన అనారోగ్య సమస్యలతో పాటు యూరిన్ ఇన్ఫెక్షన్ తదితర సమస్యలతో బాధపడుతున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన మహేష్‌కు వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించేందుకు ‘మీకోసం మేమున్నాం’ టీం ముందుకు వచ్చింది. సంస్థ ఆధ్వర్యంలో ఫండ్ రైజింగ్ ద్వారా సేకరించిన రూ.10 వేలు ఆర్థిక సహాయాన్ని గురువారం ఉదయం 11 గంటలకు చర్లలోని ‘మీకోసం మేమున్నాం’ కార్యాలయంలో సంస్థ కార్యవర్గ సభ్యుడు శేశెట్టి సాంబశివరావు చేతుల మీదుగా మహేష్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ.. అనుకోని కష్టాలు ఎదురైనప్పుడు పేద కుటుంబాల జీవితాలు కకావికలమవుతాయని అన్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అందించే చిన్నపాటి సహాయం కూడా బాధిత కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తుందని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే సంస్థ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూనెం గౌతమి, కవ్వాల రాము, ముసలి సతీష్, దొడ్డి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News