మామునూర్ విమానాశ్రయానికి సేవాలాల్ మహారాజ్ పేరు పెట్టాలి.

రాష్ట్రీయ గోర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షులు సపావట్ మహేందర్....వెల్లడి

Published On
మామునూర్ విమానాశ్రయానికి సేవాలాల్ మహారాజ్ పేరు పెట్టాలి.

హనుమకొండ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్24
(లోకల్ గైడ్ న్యూస్)
                                       హనుమకొండ,  మామునూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బంజారా జాతి ఆరాధ్య దైవమైన శ్రీ సేవ సంతులాల్ మహారాజ్ పేరు పెట్టాలని రాష్ట్రీయ గోర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షులు సపావట్ మహేందర్ అన్నారు. గురువారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహేందర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఒకే సంస్కృతి సాంప్రదాయాలు బంజారాజాతుల ఆరాధ్య దైవమైన శ్రీ సేవాలాల్ సంతు మహారాజ్ సమాజం కోసం స్వాతంత్ర ఉద్యమంలో అనేక పోరాటాలు చేశారన్నార. ఈ భారత దేశం కోసం ఎందరో గోర్ బంజారా యోధులు బలిదానాలు అయ్యారని, సేవాలాల్ మహారాజ్ అఖండ భారతదేశంలో ఘన చరిత్ర కలిగిన ధైర్య సాహసాలు చేసిన మహా యోధుడన్నారు. సమాజాన్ని జాగృతి చేయడానికి పెళ్లి చేసుకోకుండా తన సంపూర్ణమైన జీవితాన్ని బడుగు బలహీన పీడిత ప్రజల పక్షాన నిలబడిన దేశ వ్యాప్తంగా ఎన్నో యుద్దాలు చేసిన మహా యోధుడన్నారు.
దేశంలో అత్యధిక బంజారా జనాభా కలిగిన జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా అని,
మామూనూర్  విమానాశ్రయానికి సేవాలాల్ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టాలని   రాష్ట్రియ గోర్ సేనా,అన్ని గోర్ బంజారా సంఘాలు డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ గోర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షులు సపావట్ మహేందర్ ఆధ్వర్యంలో లంబాడి హక్కుల పోరాట సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు లోక్ నాయక్, సేవాలాల్ సేన హనుమకొండ జిల్లా అధ్యక్షులు కునుసోత్ మురళి నాయక్, సేవాలాల్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షులు ఇస్లావత్ మోహన్ నాయక్, హ్యుమన్ రైట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బదావత్ రాజు నాయక్,సంగెం మాజీ జెడ్ పి టి సి వీరమ్మ, భనోత్ లలిత తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News