మల్లారెడ్డి పల్లి పీఏసీఎస్ చైర్మన్ గా బయ్యగోని కుమారస్వామి ప్రమాణ స్వీకారం.

హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాం రెడ్డి...వెల్లడి

Published On
మల్లారెడ్డి పల్లి పీఏసీఎస్ చైర్మన్ గా బయ్యగోని కుమారస్వామి ప్రమాణ స్వీకారం.

హనుమకొండ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్
(లోకల్ గైడ్ న్యూస్)

హసన్ పర్తి మండలం మల్లారెడ్డి పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పి ఎ సి ఎస్) నూతన ఛైర్మన్, పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పిఎసిఎస్ ఛైర్మన్ బయ్యగోని కుమారస్వామి, పాలకవర్గ  సభ్యులందరికీ డీసీసీ అధ్యక్షులు ఇనగాల శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా సత్కరించి తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని మన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాత ప్రభుత్వమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వ్యవసాయ రంగంలో సహకార సంఘాల పాత్ర అత్యంత కీలకమైనదని గుర్తు చేశారు. నూతనంగా ఎన్నికైన ఛైర్మన్ బయ్యగోని కుమారస్వామి  నేతృత్వంలోని పాలకవర్గం మల్లారెడ్డి పల్లి పరిధిలోని ప్రతి రైతుకూ సకాలంలో రుణాలు, ఎరువులు అందేలా చూస్తూ, రైతులకు నమ్మకమైన వేదికగా నిలవాలన్నారు. క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. 
ఈ సందర్భంగా నూతనంగా చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన బయ్యగోని కుమారస్వామి మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉండి, రైతులకు అన్నిరకాల సౌకర్యాలు పీఏసీఎస్ నుండి ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లు, సహకార శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు హసన్‌పర్తి మండల కాంగ్రెస్ నాయకులు మండలం పరిధిలోని రైతులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

అనంతగిరి హిల్స్ రన్: విజేతలను సత్కరించిన బీజేపీ నాయకులు అనంతగిరి హిల్స్ రన్: విజేతలను సత్కరించిన బీజేపీ నాయకులు
        వికారాబాద్ (లోకల్ గైడ్) జిల్లా బ్యూరో : అనంతగిరి హిల్స్‌లోని హరిత రిసార్ట్‌లో 'అవంతిక కన్స్ట్రక్షన్స్' ఆధ్వర్యంలో నిర్వహించిన 5, 16, మరియు 32 కిలోమీటర్ల
ఖమ్మం ఫోటోగ్రాఫర్‌ ముత్యాల నాగేశ్వరరావుకు జాతీయ కీర్తి!
వికారాబాద్ జిల్లా కేంద్రం లో మాతా శిశు ఆసుపత్రి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని, కాంట్రాక్ట్ రద్దు చేయాలి: 
_మాదిగ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి
అక్టోబర్ 6న ఛలో హైదరాబాద్
సినీ దర్శకుడు శ్రీనివాసరావు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ కొండేటి మల్లయ్య. 
అక్టోబర్‌ 8న ఆర్టీసీ ఎక్స్‌ రోడ్‌  బస్ భవన్‌ ఎదుట ధర్నా పోస్టర్లు ఆవిష్కరణ దివ్యాంగులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించాలి