తుపాను ప్రభావంతో అప్రమత్తంగా ఉండాలి.

ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలి.

తల్లాడ ఎస్సై వెంకటకృష్ణ సూచన
Published On
తుపాను ప్రభావంతో అప్రమత్తంగా ఉండాలి.

తల్లాడ సెప్టెంబర్ 24, లోకల్ గైడ్:


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న కారణంగా ఈదురుగాలులు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో తల్లాడ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తల్లాడ ఎస్సై వెంకటకృష్ణ సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు.

మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేపల వేటకు వెళ్లవద్దని, వర్షాలు,గాలుల తీవ్రత ఉన్న సమయంలో చెరువులు,వాగులు, కాలువలు,నీటి ప్రవాహ ప్రాంతాల వైపు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని ఎస్సై సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.

అదేవిధంగా వర్షాల సమయంలో విద్యుత్‌ స్తంభాలు,విద్యుత్‌ తీగలు,ట్రాన్స్‌ఫార్మర్ల సమీపానికి వెళ్లవద్దని హెచ్చరించారు. అత్యవసరమైతేనే తప్ప ప్రజలు బయటకు రావద్దని, అవసరమైన వస్తువులను ముందుగానే సమకూర్చుకుని సురక్షితంగా ఉండాలని సూచించారు.

మండలంలోని మారుమూల ప్రాంతాల్లో ఎక్కడైనా వరదలు, రహదారులపై నీటి ప్రవాహం,చెట్లు విరిగిపడటం, విద్యుత్‌ సమస్యలు లేదా ఇతర విపత్తుకర పరిస్థితులు ఏమైనా ఎదురైతే ప్రజలు ఆలస్యం చేయకుండా వెంటనే తల్లాడ పోలీస్ కు సమాచారం అందించాలని.ఎస్సై వెంకటకృష్ణ కోరారు.

ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా తల్లాడ పోలీస్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని, ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు.

Tags:

About The Author

Latest News