- District News
- విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం
విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం
పెద్దపల్లి జిల్లా సెప్టెంబర్ 22
(లోకల్ గైడ్)
పట్టణంలోని అశోక్‌నగర్ 8వ వార్డులో గల ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని మంగళవారం వార్డు కౌన్సిలర్ చింతల రాజు ప్రారంభించారు. విద్యార్థులకు అల్పాహారం కార్యక్రమా
న్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ చింతల రాజు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభ్యాసాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అల్పాహార పథకం ఎంతో ఉపయోగకరమన్నారు. ఉదయం పూట విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారు ఉత్సాహంగా పాఠశాలకు హాజరై చదువుపై దృష్టి సారించే అవకాశం ఉంటుందని తెలిపారు.
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆదేశాల మేరకు పాఠశాలలో అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చింతల రాజు తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక రాజేశం, బోగిరి శంకరమ్మ, పర్వతం దేవరాజు, గిరుగుల లక్ష్మి, సాయినాథ్, చింతల రమేష్, వార్డు ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
