గాంధీ జయంతి నాడు శ్రీచైతన్య స్కూల్ స్పెషల్ క్లాసులు: -  బిఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం

- గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం అధికారిక సెలవు

Published On
గాంధీ జయంతి నాడు శ్రీచైతన్య స్కూల్ స్పెషల్ క్లాసులు: -  బిఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం

లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా బ్యూరో:

వికారాబాద్ పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంపై టీఆర్‌ఎస్‌వీ (బిఆర్‌ఎస్‌వీ) జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం
చేశారు. సెలవు రోజున విద్యార్థులను పాఠశాలకు పిలిపించి స్పెషల్ క్లాసుల పేరుతో తీవ్ర ఇబ్బందులకు గురిIMG-20261002-WA0367చేయడం సరైన పద్ధతి కాదని ఆయన ప్రశ్నించారు.
సెలవు దినాన పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారనే సమాచారంతో టీఆర్‌ఎస్‌వీ నాయకులు పాఠశాలను సందర్శించి యాజమాన్యాన్ని వివరణ కోరారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి తరగతులు నిర్వహించిన శ్రీచైతన్య పాఠశాలపై విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
పాఠశాలలో అక్రమంగా యూనిఫాం విక్రయాలు: చర్యలకు డిమాండ్
పాఠశాల ప్రాంగణంలో నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ యూనిఫామ్‌లను విక్రయిస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందని దీపక్‌రెడ్డి తెలిపారు. యూనిఫాం పేరిట తల్లిదండ్రులపై అనవసర ఆర్థిక భారం మోపకుండా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కోరారు. ఈ విక్రయాల వ్యవహారంపై కూడా విద్యాశాఖ అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరవు
సెలవు రోజుల్లో తరగతుల నిర్వహణ, నిబంధనలకు విరుద్ధంగా యూనిఫాంల విక్రయాలపై ఇప్పటికే డీఈఓ,ఎంఈఓ లకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేకపోవడం శోచనీయమని ఆయన ఆరోపించారు. కళ్లముందే నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో స్పష్టం చేయాలన్నారు.
విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి విద్యార్థుల హక్కులను, తల్లిదండ్రుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు. ఈ సమగ్ర వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి విచారణకు ఆదేశించాలని, అలాగే ఫిర్యాదులపై స్పందించని అధికారుల వైఖరిపైనా సమీక్ష జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌వీ నాయకులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గాంధీ జయంతి నాడు శ్రీచైతన్య స్కూల్ స్పెషల్ క్లాసులు: -  బిఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం గాంధీ జయంతి నాడు శ్రీచైతన్య స్కూల్ స్పెషల్ క్లాసులు: -  బిఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం
లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా బ్యూరో: వికారాబాద్ పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంపై టీఆర్‌ఎస్‌వీ (బిఆర్‌ఎస్‌వీ) జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి...
ప్రార్థించే పెదవుల్లో కన్నా సహాయం చేసే చేతులు మిన్న  - మానవత్వం 
దళిత నాయకుడి ఎదుగుదలను ఓర్వలేకే అక్రమ కేసులు
మహాత్ముడి ఆశయాలు నేటి తరానికి ఆదర్శం
మహాత్మునికి ఘనమైన నివాళులు
ఘనంగా గాంధీ ,శాస్త్రీ ల జయంతి వేడుకలు
ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.