- District News
- Ranga Reddy
- రోడ్ డివైడర్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
రోడ్ డివైడర్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
Published On
By Ram Reddy
మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ సర్కిల్ నాదర్గుల్ డివిజన్ పరిధిలోని గ్రీన్ హోమ్స్ కాలనీ నుంచి గాంధీనగర్ చౌరస్తా వరకు చేపట్టనున్న రోడ్ డివైడర్ పనులకు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు.
ప్రధాన రహదారిపై ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, రహదారి భద్రత, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఈ రోడ్ డివైడర్ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణంతో ప్రజలకు మెరుగైన సౌకర్యం ఏర్పడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు, పలువురు కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు
Tags:
About The Author
Related Posts
Latest News
14 Oct 2026 21:43:58
నర్సంపేట క్రైమ్, అక్టోబర్ 14 - లోకల్ గైడ్ :
నర్సంపేటలో గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ సేల్స్మెన్నే బోల్తా కొట్టించి రూ.5.50 లక్షలు ఎగవేసిన ఘటన
