హనుమకొండ జిల్లా ప్రతినిధి,ఆగస్టు08
(లోకల్ గైడ్ న్యూస్):
హనుమకొండ, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులుగా బొల్లు సోమిరెడ్డిని నియమిస్తూ ఉద్యమకారుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం నియామక పత్రాన్ని వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు సోమిరెడ్డికి అందించి ఉద్యమకారుల సంక్షేమం, ఆత్మగౌరవం, తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చుటకు కృషి చేయాలని ఆదేశించారు. అనంతరం బొల్లు సోమిరెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ సాధనలో పాల్గొని ప్రత్యేక తెలంగాణ కోసం తన వంతుగా కృషి చేసినందుకుగాను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుండి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించినందుకు తెలంగాణ ఫోరం ఉద్యమకారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు ఈ బాధ్యత అప్పగించినందుకు ఉద్యమకారుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తానని చెప్పి ఇప్పటివరకు ఉద్యమకారులకు ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందనీ ఉద్యమ సమయంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారునికి తగిన న్యాయం జరిగేలా తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ నియామకంలో ఉద్యమకారుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, అడ్వకేట్ నందగిరి రజినీకాంత్, వరంగల్ జిల్లా అధ్యక్షులు చల్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.