- District News
- గాజీపూర్ మహోత్సవానికి పైలెట్ రోహిత్ రెడ్డికి ఆహ్వానం
గాజీపూర్ మహోత్సవానికి పైలెట్ రోహిత్ రెడ్డికి ఆహ్వానం
శ్రీ వెంకట చెన్నకేశవ స్వామి, నాగదేవత ప్రతిష్ఠాపనకు హాజరుకావాలని గ్రామస్తుల విజ్ఞప్తి.
Published On
By Ram Reddy
లోకల్ గైడ్/తాండూర్
పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామంలో ఆగస్టు 29 నుంచి 31 వరకు నిర్వహించనున్న శ్రీ వెంకట చెన్నకేశవ స్వామి, నాగదేవత ప్రతిష్ఠాపన మహోత్సవానికి తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఆహ్వానించారు.శనివారం
మణికొండలోని ఆయన నివాసానికి వెళ్లిన గ్రామ పెద్దలు నారాయణరెడ్డి, లాల్ రెడ్డి, వీరప్ప, నసీరుద్దీన్, యువకుడు విష్ణువర్ధన రెడ్డి,గ్రామస్తులు మహోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని రోహిత్ రెడ్డిని కోరారు. ఇందుకు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.కాగా మూడు రోజుల పాటు నిర్వహించనున్న మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు గ్రామంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Latest News
22 Aug 2026 21:30:17
లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా
వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వ్యవసాయ శాఖ ఏ డి ఏ ఎస్
