ఘనంగా కౌన్సిలర్ ఎనుమల రమేష్ జన్మదిన వేడుకలు

బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య సందడిగా బర్త్‌డే వేడుకలు

Published On
ఘనంగా కౌన్సిలర్ ఎనుమల రమేష్ జన్మదిన వేడుకలు

లోకల్ గైడ్ ఆమనగల్లు
ఆగస్టు 8 
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణంలో బీఆర్‌ఎస్ నాయకుడు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్ ఎనుమల రమేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రమేష్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
జన్మదిన వేడుకల సందర్భంగా రమేష్‌ను పలువురు నాయకులు, కార్యకర్తలు శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు. రమేష్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ప్రజా జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధితో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా పలువురు నాయకులు కోరారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు, అభిమానుల సందడితో జన్మదిన వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్, మున్సిపల్ కౌన్సిలర్లు పాపిశెట్టి రాము, ఆంజనేయులు, జగన్, ఎంగలి రఘు, ఖలీల్, సైదులు, జంతుక కిరణ్, భాస్కర్, గోపి, వెంకటయ్య, ప్రసాద్‌తో పాటు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి: వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి:
    లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా  వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వ్యవసాయ శాఖ ఏ డి ఏ ఎస్
సల్బత్తాపూర్‌లో తాగునీటి కష్టాలు.. బిందెలతో గ్రామస్తుల నిరసన.
గాజీపూర్ మహోత్సవానికి పైలెట్ రోహిత్ రెడ్డికి ఆహ్వానం
సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్‌లు
హనుమకొండ లో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ నిరసన 
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై మంత్రి పొంగులేటి ఆగ్రహం భూభారతి సదస్సులు, సాదాబైనామా అర్జీలను వెంటనే పరిష్కరించాలి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలి ...