కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలి ...  

తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి డిమాండ్     

Published On
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలి ...  

 


నిజామాబాద్ జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్, ఆగష్టు 22:

రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న యూరియా బుకింగ్ యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి, రైతులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా యూరియా అందుబాటులో ఉంచాలని తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి డిమాండ్ చేశారు.  యూరియా పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఎఫ్ఎఫ్ఎస్ యాప్ విధానం రైతులకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతోందని పేర్కొన్నారు.  స్మార్ట్ ఫోన్లు వాడకంలో లేని రైతులు, పట్టాదారు పాస్ పుస్తకాలు లేని రైతులు, డిజిటల్ పరిజ్ఞానం కాని రైతులు ఈ యాప్ ద్వారా ఎరువులు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యలు, సర్వర్ డౌన్ సమస్యల వల్ల ఎరువులు సకాలంలో అందడం లేదని, వెంటనే యాప్ విధానాన్ని ఎత్తివేయాలని కోరారు. పాత మాన్యువల్ విధానం ద్వారా ఎరువుల దుకాణాల వద్దే నేరుగా పాత పద్ధతిలో యూరియా కాంప్లెక్స్ ఎరువులు అందజేయాలని, పట్టాదారు పాస్ బుక్ నిబంధనలను సడలింపు చేసి వ్యవసాయం సాగు చేస్తున్న రైతులందరికీ యూరియా, కాంప్లెక్స్ ఎరువులను అందజేయాలని అయన కోరారు.

Tags:

About The Author

Latest News

వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి: వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి:
    లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా  వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వ్యవసాయ శాఖ ఏ డి ఏ ఎస్
సల్బత్తాపూర్‌లో తాగునీటి కష్టాలు.. బిందెలతో గ్రామస్తుల నిరసన.
గాజీపూర్ మహోత్సవానికి పైలెట్ రోహిత్ రెడ్డికి ఆహ్వానం
సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్‌లు
హనుమకొండ లో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ నిరసన 
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై మంత్రి పొంగులేటి ఆగ్రహం భూభారతి సదస్సులు, సాదాబైనామా అర్జీలను వెంటనే పరిష్కరించాలి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలి ...