- District News
- Warangal
- హనుమకొండ లో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ నిరసన
హనుమకొండ లో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ నిరసన
కూడా మాజీ చైర్మన్, ఓబీసీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్...వెల్లడి
హనుమకొండ జిల్లా ప్రతినిధి,ఆగస్టు22
(లోకల్ గైడ్ న్యూస్)
పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు, టీచర్స్ రూపారెడ్డి మరణంకాదు....విద్యావ్యవస్థకు హెచ్చరిక అని నినాదాలు,కూడా మాజీ చైర్మన్, ఓబీసీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ
ప్రిన్సిపాల్ రూపరెడ్డి ఫ్యామిలీకి సంఘీభావం తెలపడానికి నిరసన ర్యాలీ చేపట్టాం అన్నారు. టీచర్స్ కు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి,
తల్లితండ్రుల తర్వాత గురువులనే దైవం లాగా భావిస్తాం. దైవంలాంటి గురువులకే రక్షణ లేకపోతే ఎలా.?
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఒక రోజు స్పందించడం వదిలేయడం కాకుండా కఠిన చర్యలు ఉండాలి.
రాబోయే రోజులలో ఏ టీచర్ కు రూపారెడ్డి పరిస్థితి రావద్దంటే తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉండాలి.ప్రైవేట్ పాఠశాలలను కాపాడేందుకు ప్రత్యేక యాక్ట్ ను ప్రభుత్వం తీసుకురావాలి.ప్రైవేట్ స్కూల్స్ తో సహా టీచర్స్ పై ఎలాంటి దాడులు జరగకుండా రక్షణ ఉండేలా చూడాలని తెలియజేశారు.
