- District News
- రక్తదానం ప్రాణదానంతో సమానం...
రక్తదానం ప్రాణదానంతో సమానం...
ప్రతి ఒక్కరు రక్తదానానికి ముందుకు రావాలి....

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జైపూర్ పోలీస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,మంచిర్యాల డిసిపి ఎ భాస్కర్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్బంగా రామగుండం పోలీస్ కమిషనర్ మాట్లాడుతు ఎస్ఐ భూమేష్,పోలీస్ అధికారులు,గ్రామ సర్పంచ్‌తో పాటు పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమన్నారు.రక్తదానం ప్రాణదానంతో సమానం అని ప్రతి ఒక్కరు రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.రక్తదానం సమాజానికి ఎంతో మేలు చేసే గొప్ప సేవా కార్యక్రమమని,అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి రక్తదాతలు అందించిన రక్తం ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.రక్తదానంపై ప్రతి ఒక్కరు అవగాహన పెంపొందించుకుని,అవసరమైన సందర్భాల్లోనే కాకుండా ఆరోగ్యపరంగా అర్హులైన వారు క్రమం తప్పకుండా స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని సీపీ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు,సిఐ నవీన్ కుమార్,పలువురు ప్రజా ప్రతినిధులు,యువకులు పాల్గొన్నారు.
