- Telangana
- ఎర్త్ అవర్‌లో భాగంగా లోక్ భవన్‌లో గంటపాటు దీపాల ఆర్పివేత
ఎర్త్ అవర్‌లో భాగంగా లోక్ భవన్‌లో గంటపాటు దీపాల ఆర్పివేత
Published On
By Ram Reddy
హైదరాబాద్, మార్చి 28: పర్యావరణ పరిరక్షణ, భూతాపం (గ్లోబల్ వార్మింగ్) పై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించే ‘ఎర్త్ అవర్’ కార్యక్రమంలో లోక్ భవన్ భాగస్వామ్యమైంది.
ఈ సందర్భంగా శనివారం రాత్రి 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు లోక్ భవన్ పరిధిలోని ప్రధాన భవనం, సిబ్బంది నివాస సముదాయం, అధికారుల క్వార్టర్స్, పరిపాలనా భవనాల్లో ఒక గంటపాటు విద్యుత్ దీపాలను నిలిపివేశారు.
ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా, ఈ ఏడాది “గివ్ అన అవర్ ఫర్ ఎర్త్” అనే థీమ్‌కు అనుగుణంగా దీపాలను ఆర్పివేసి పర్యావరణ పరిరక్షణకు తమ మద్దతును తెలియజేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరాన్ని ప్రజలకు గుర్తుచేసే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Latest News
13 Aug 2026 21:20:53
చర్ల : లోకల్ గైడ్ న్యూస్ :చర్ల మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన గగనం రాజు కుమారుడు గగనం మహేష్ (10) చిన్న వయసులోనే కిడ్నీ
