ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా డీఎల్ఎస్ఏ అవగాహన కార్యక్రమం:

Published On
ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా డీఎల్ఎస్ఏ అవగాహన కార్యక్రమం:


ఖమ్మం,ఆగస్టు13: లోకల్ గైడ్:

ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఖమ్మం ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ ఆసుపత్రి, ఖమ్మంలో అవయవదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎల్ఎస్ఏ కార్యదర్శి శ్రీమతి పి. దేవి మాట్లాడుతూ, అవయవదానం ద్వారా మరణానంతరం కూడా విలువైన ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని, అవయవదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అవయవదానం చేయదలచిన వారు నమోదు చేసుకునే విధానం, అవయవదానానికి సంబంధించిన సమ్మతి, చట్టపరమైన అంశాలు మరియు పాటించాల్సిన విధివిధానాలను వివరించారు. అవయవదానం పూర్తిగా స్వచ్ఛందంగా, చట్టబద్ధమైన ప్రక్రియలో జరగాలని, అవయవాల అక్రమ వ్యాపారాన్ని చట్టం నిషేధిస్తుందని తెలిపారు.
అవయవదానంపై సమాజంలో విస్తృత అవగాహన కల్పించడం ద్వారా అవసరమైన రోగులకు కొత్త జీవితాన్ని అందించవచ్చని, యువత 
కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ శ్రీ నరేందర్, వైద్య సిబ్బంది, శిక్షణ పొందుతున్న విద్యార్థులు, డీఎల్ఎస్ఏ ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు   పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News