న్యాయవ్యవస్థ,చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్గి ఉండాలి.

జిల్లేడు చౌదరిగూడెం మండల ఎస్సై విజయ్ కుమార్.

Published On
న్యాయవ్యవస్థ,చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్గి ఉండాలి.

 

 

లోకల్ గైడ్, జిల్లేడు చౌదరిగూడెం.

భారత న్యాయ వ్యవస్థపై మరియు చట్టాలపై విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలని స్థానిక ఎస్సై విజయ్ కుమార్ విద్యార్థులతో అన్నారు. గురువారం మండల పరిధిలోని లాల్పహాడ్ లో గల కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు న్యాయవ్యవస్థ,చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై విజయ్ కుమార్ మాట్లాడుతూ 2012లో భారత న్యాయ వ్యవస్థ ద్వారా పోక్సో చట్టం తీసుకువచ్చిందన్నారు. లైంగిక వేధింపులు దాడుల నుండి పూర్తి రక్షణ వంటి వాటిని చట్టంలో చేర్చడం జరిగిందన్నారు. 18 ఏళ్ల బాలబాలికలకు ఈ చట్టం వర్తిస్తుందన్నారు. నేరస్తుడు, స్త్రీ, లేదా పురుషుడైన నేరం చేసినట్లయితే వారికి చట్ట ప్రకారం శిక్ష పడుతుందన్నారు. ఎక్కడైనా ప్రమాదాలు,,లైంగిక దాడులు జరిన వెంటనే పోలీసులకు లేదా, చైల్డ్ వెల్పర్ కమిటీకి వెంటనే సమాచారం ఇచ్చేందుకు భాద్యత తీసుకోవాలని కోరారు. రహదారి భద్రత ట్రాఫిక్ నిబంధనలు, ప్రయాణాల్లో పాటించాల్సిన జాగ్రత్తలపై  విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా గ్రామాల్లో యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతూ మృతి చెందుంతూ కుటుంబాలను అనాధలుగా చేస్తున్నారని వివరించారు. విద్యార్థులగా మీ గ్రామాల్లో చట్టాలపై తొటి వ్యక్తులకు అవగాహన కల్పించాల్సిన భాద్యత మీకుందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి తమ భవిష్యత్ ఉన్నతంగా తీర్చి దిద్దుకోవాలని సూచించారు. ఎక్కడైనా లైంగిక పరమైన దాడులు, వేదింపులు, ప్రమాదకర సమస్యలు ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని విద్యార్థులను కోరారు.ఈ కార్యక్రమంలోఎస్సై విజయ్ కుమార్, ప్రిన్సిపాల్ రాఘసుధ, ఉపాధ్యాయురాలు, మహిళా పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News