భీమ్‌గల్‌ తహశీల్దార్ కార్యాలయంలో సబ్‌కలెక్టర్ తనిఖీలు

Published On
భీమ్‌గల్‌ తహశీల్దార్ కార్యాలయంలో సబ్‌కలెక్టర్ తనిఖీలు

లోకల్ గైడ్ నిజామాబాదు జిల్లా ప్రతినిధి, ఆగష్టు 13: 

భీమ్​గల్​ మండల తహశీల్దార్ కార్యాలయాన్ని ఆర్మూర్ సబ్‌కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో వివిధ సేవల పై సమీక్షించారు.
ముఖ్యంగా ‘భూభారతి’ పోర్టల్‌లోని పెండింగ్ దస్త్రాలను, దరఖాస్తుల స్థితిగతులను సబ్ కలెక్టర్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
భూ సంబంధిత సమస్యల పై ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అదేశించారు. పోర్టల్‌లో దస్త్రాల ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా సేవలు అందించాలని ఆదేశించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో తహశీల్దార్ కిరణ్ కుమార్, డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ మల్లేష్, స్వాతి, కార్యాలయ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News