తాండూరులో 1.26 కిలోల గంజాయి స్వాధీనం.

ముగ్గురు నిందితులు అరెస్ట్.

న్యాయస్థానానికి తరలింపు. వివరాలు వెల్లడించిన పట్టణ పోలీసులు.
Published On
తాండూరులో 1.26 కిలోల గంజాయి స్వాధీనం.

లోకల్ గైడ్/తాండూర్:

వికారాబాద్ జిల్లా తాండూరులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి 1.26 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...విలియం మూన్ స్కూల్ గ్రౌండ్ వద్ద అనుమానాస్పదంగా బ్యాగులతో తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా గంజాయి లభ్యమైంది. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ అన్వర్ పాషా, తాండూర్ టౌన్ ఇన్‌స్పెక్టర్ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

డ్రోన్ నిఘాతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట... డ్రోన్ నిఘాతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట...
    రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు ప్రజలకు ప్రశాంతమైన,సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా మంచిర్యాల పట్టణం,నస్పూర్,శ్రీరాంపూర్ ప్రాంతాల్లో మంచిర్యాల డిసిపి ఎ
మాగనూర్ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రులకు కృతజ్ఞతలు శివరామ్ రెడ్డి 
ఘనంగా ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి జన్మదిన వేడుకలు 
తాండూరులో 1.26 కిలోల గంజాయి స్వాధీనం.
బొప్నారంలో కాంగ్రెస్‌ గ్రామ కమిటీ ఏర్పాటు.
ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెంచాలి
చదువుతోనే ఉన్నత భవిష్యత్తు.. విద్యార్థులకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచన