డ్రోన్ నిఘాతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట...

ఈవ్‌టీజింగ్,బహిరంగ మద్యపానానికి చెక్

Published On
డ్రోన్ నిఘాతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట...

IMG-20260820-WA0241

 

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు ప్రజలకు ప్రశాంతమైన,సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా మంచిర్యాల పట్టణం,నస్పూర్,శ్రీరాంపూర్ ప్రాంతాల్లో మంచిర్యాల 
డిసిపి ఎ భాస్కర్ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక డ్రోన్ నిఘా ఆపరేషన్ నిర్వహించారు.పాఠశాలలు,బాలికల వసతి గృహాలు,కళాశాలల పరిసరాలు,గోదావరి నది తీర ప్రాంతాలు,మైదానాలు తదితర ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవించడం,ఈవ్‌టీజింగ్‌కు పాల్పడటం,యువతను ఇబ్బందులకు గురిచేయడం,ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.రాజీవ్‌నగర్‌లోని గర్ల్స్ మోడల్ స్కూల్,సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ పరిసర ప్రాంతాలు,ఎఫ్‌సీఐ గోదాం ప్రాంతం, కాలేజీ రోడ్డు,గోదావరి నది తీర ప్రాంతాలు,మంచిర్యాల,నస్పూర్,శ్రీరాంపూర్ పరిధిలోని మైదానాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా నిర్వహించారు.డ్రోన్ విజువల్స్ ఆధారంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న13మందిని అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారు.ఈవ్‌టీజింగ్,అనుమానాస్పదంగా సంచరించడం,ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా డిసిపి ఎ భాస్కర్ మాట్లాడుతు పాఠశాలలు,కళాశాలలు,బాలికల వసతి గృహాలు,మహిళలు మరియు విద్యార్థినులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడటం,మహిళలు బాలికలను వేధించడం,వారిని వెంబడించడం వంటి చర్యలను పోలీసులు ఏమాత్రం సహించబోరని హెచ్చరించారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం,మద్యం సేవించి ప్రజలకు ఇబ్బందులు కలిగించడం,అసభ్యంగా ప్రవర్తించడం,గొడవలకు పాల్పడటం,మహిళలు,విద్యార్థినులను వేధించడం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రజల భద్రతకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు.చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు పోలీసుల నిఘా నుంచి తప్పించుకోలేరని డీసీపీ తెలిపారు.పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గురువారం మంచిర్యాల పట్టణంతో పాటు నస్పూర్,శ్రీరాంపూర్ పరిధిలోని సున్నిత ప్రాంతాలు,పాఠశాలలు,కళాశాలలు,బాలికల వసతి గృహాల పరిసరాలు,నదీతీర ప్రాంతాలు,మైదానాలు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక డ్రోన్ నిఘా నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు.చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని,ప్రజల భద్రత,మహిళలు విద్యార్థినుల రక్షణ విషయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తారని డిసిపి చేశారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎసిపి ఆర్ ప్రకాష్,మంచిర్యాల టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావు,ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

డ్రోన్ నిఘాతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట... డ్రోన్ నిఘాతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట...
    రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు ప్రజలకు ప్రశాంతమైన,సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా మంచిర్యాల పట్టణం,నస్పూర్,శ్రీరాంపూర్ ప్రాంతాల్లో మంచిర్యాల డిసిపి ఎ
మాగనూర్ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రులకు కృతజ్ఞతలు శివరామ్ రెడ్డి 
ఘనంగా ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి జన్మదిన వేడుకలు 
తాండూరులో 1.26 కిలోల గంజాయి స్వాధీనం.
బొప్నారంలో కాంగ్రెస్‌ గ్రామ కమిటీ ఏర్పాటు.
ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెంచాలి
చదువుతోనే ఉన్నత భవిష్యత్తు.. విద్యార్థులకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచన