దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో అసలు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి:

కలెక్టర్లకు సీఈఓ సుదర్శన్ రెడ్డి ఆదేశం
Published On
దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

IMG-20261017-WA0212

లోకల్ గైడ్ వికారాబాద్ జిల్లా బ్యూరో ప్రతినిధి :

 సమగ్ర సవరణ (సర్ ) ప్రక్రియలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారి అధికారులను ఆదేశించారు.
శనివారం ఎస్‌ఐఆర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు తదితర అంశాలపై హైదరాబాదు నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ ) సుదర్శన్ రెడ్డి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వికారాబాద్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి అదనపు కలెక్టర్, సంబంధిత అధికారులతో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ... ఎస్‌ఐఆర్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫారం-6, ఫారం-7, ఫారం-8లకు సంబంధించిన దరఖాస్తులకు ప్రాధాన్యమిచ్చి, పరిశీలన వేగవంతం చేయాలని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న విచారణలను త్వరగా పూర్తి చేసి, అవసరమైన వారికి నోటీసులు జారీ చేయడంతో పాటు తదుపరి చర్యలను సకాలంలో చేపట్టాలని సూచించారు.
ఓటర్లకు జారీ చేయాల్సిన నోటీసులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు. బూత్ లెవల్ అధికారులు ( బి ఎల్ ఓ లు) నేరుగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి నోటీసులు అందజేయడంతో పాటు, అవసరమైన పత్రాలను వారి వద్దే స్వీకరించాలన్నారు. అర్హతలను నిర్ధారించే సమయంలో సంబంధిత పత్రాలను జాగ్రత్తగా పరిశీలించి, అర్హులైన వారి వివరాలు సక్రమంగా నమోదయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు, అనర్హుల నమోదు లేదా డూప్లికేట్ వివరాలు లేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రతి బీఎల్‌ఓ తమ పరిధిలోని దరఖాస్తులు, ఓటర్ల వివరాల రికార్డులను భౌతిక పత్రాల (ఫీజికల్ ఫామ్స్ ) రూపంలో సక్రమంగా భద్రపరచాలని సూచించారు.
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగానే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు చేపట్టాలని సీఈఓ సూచించారు. ఎమ్మెల్సీ దరఖాస్తులతో పాటు సమర్పించిన ఒరిజినల్ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి.. నకిలీ, తప్పుడు మరియు డూప్లికేట్ దరఖాస్తులు లేకుండా అర్హతలను మాత్రమే ఖరారు చేయాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీఓ వాసు చంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నెమత్ హాలీ తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

జిల్లాస్థాయి భజన పోటీలలో దమగాన్ పూర్ కు రెండవ బహుమతి  జిల్లాస్థాయి భజన పోటీలలో దమగాన్ పూర్ కు రెండవ బహుమతి 
లోకల్ గైడ్:మద్దూర్ నారాయణ పేట జిల్లా దన్వాడ మండలం  గున్ముకుల   గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 60 గ్రామాలు పాల్గొనడం జరిగింది ఆతరువాత డ్ర వేయడం జరిగింది...
గేట్ కారేపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కల్లూరు సర్పంచ్‌ చెక్‌ పవర్‌ ఫ్రీజ్‌పై సుంకేట పోశెట్టి ఆవేదన ఎస్సీ సర్పంచ్‌పై వివక్ష చూపుతున్నారంటూ ఆరోపణలు.. చెక్‌ పవర్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌.
సీనియర్ నాయకులు కొట్టేరు శ్రీనివాస రెడ్డి గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
నేడు డిప్యూటీ సీఎం పర్యటనకు సింగరేణి సర్పంచులు సన్నద్ధం కావాలి! రంజిత్ కుమార్ 
దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు  ఘనంగా నిర్వహిస్తున్న శ్రీ నవదుర్గా ఉత్సవ కమిటీ