- District News
- Ranga Reddy
- కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల ప్రజా పాలన విజయోత్సవ ర్యాలీకి ఆహ్వానం
కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల ప్రజా పాలన విజయోత్సవ ర్యాలీకి ఆహ్వానం
రేపు ఉదయం 9:30 గంటలకు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 1000 రోజుల ప్రజా పాలనలో, రైతులు, మహిళలు, యువత, పేదలు, సామాన్య ప్రజల సంక్షేమం మరియు రాష్ట్ర అభివృద్ధి కోసం అమలు చేస్తున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమానికి అన్ని గ్రామాల సర్పంచ్ లు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, మాజీ వార్డు మెంబర్లు, సింగిల్విండో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ సింగిల్విండో చైర్మన్లు, మాజీ వైస్ చైర్మన్లు, మాజీ డైరెక్టర్లు, మాజీ ZPTC లు, మాజీ ఎంపీపీ లు, మాజీ ఎంపీటీసీలు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, రైతులు, NSUI నాయకులు, OBC సెల్, SC సెల్, ST సెల్, మైనార్టీ సెల్, కిసాన్ సెల్ నాయకులు, విలేజ్ కమిటీ అధ్యక్షులు, BLA లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి
ప్రింట్ మీడియా మరియు ఎలెక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం...
మీ
రాయికల్ శ్రీనివాస్,
ఫరూక్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.
