దళిత నాయకుడిని విమర్శించడం సిగ్గు చేటు....

బిఆర్ఎస్వి జిల్లా మాజీ అధ్యక్షులు బడికెల శ్రావణ్...

Published On
దళిత నాయకుడిని విమర్శించడం సిగ్గు చేటు....

 

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

 

భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ మనకు కల్పించిన వరం ప్రశ్నించే నైతిక హక్కు అని అది మరవకుండా ఏది పడితే అది మాట్లాడకు అని కాంగ్రెస్ నాయకులు పైడిమల్ల నర్సింగ్ కు బిఆర్ఎస్వీ జిల్లా మాజీ అధ్యక్షులు,బిఆర్ఎస్ యువ నాయకులు బడికెల శ్రావణ్,కిరణ్ కుమార్ లు హితవు పలికారు.గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని,నిన్ను చూస్తే దళిత సమాజం సిగ్గు పడుతుందని పేర్కొన్నారు.డాక్టర్ రాజా రమేష్ ఒక వైద్యునిగా వైద్య సేవలు అందిస్తు,అదేవిధంగా ప్రజా సేవ చేస్తు అందరి మన్ననలు పొంది సింగరేణిలో వైద్య వృత్తికి రాజీనామా చేసి ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో ముందుకు పోతున్న వేళ నీలాంటి వాళ్ళు ధో నంబర్ దందా చేసుకుంటు,భూ పంచాయతీలు చేస్తు,అనేక మంది అమాయక ప్రజలను బెదిరించి భయబ్రాంతులకు గురిచేసి సంపాదిస్తు,పలు నేరాలలో రోజు పోలీసు స్టేషన్ కు వెళ్ళి సంతకాలు చేసే మీరు మా పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్ విమర్శించడం సిగ్గు చేటు అని,దయ్యాలు వేదాలు అల్లినట్లు ఉందని ఎద్దేవ చేశారు.మీరు ఏమి మాట్లాడినా ప్రజలకు మీ గురించి, మీ చేష్టల గురించి,మీ తెల్ల బట్టల వెనుక ఉన్న నేర చరిత్ర గురించి తెలుసునని అన్నారు.ఈరోజు నువ్వు బట్టలు వేసుకొని తిరుగుతున్నావంటే అది మా పార్టీ నాయకులు పెట్టిన బిక్ష అని మర్చిపోవద్దు అని,ఒక దళిత నాయకుడి హోదాలో మాట్లాడి ఇంకో దళిత నాయకుడిని విమర్శించకు అని అన్నారు.మరోసారి ఇలా మాట్లాడితే నీకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.ఈ సమావేశంలో నాయకులు జిలకర మహేష్,కిరణ్ కుమార్,జాడి మహేష్,కొండ కుమార్,శ్రీకాంత్,శివ,మణి,కంది క్రాంతి,సాయి దేవి,మణి కుమార్,స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News