గిరిజన హక్కుల పరిరక్షణపై విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు

చట్టాలపై అవగాహనతో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలి – అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వి. తరణి

Published On
గిరిజన హక్కుల పరిరక్షణపై విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు

సిద్దిపేట, ఆగస్టు 6(లోకల్ గైడ్):

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ మరియు సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్ జి. సుదర్శన్ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం సిద్దిపేటలోని మహాత్మా గాంధీ జ్యోతిబా ఫూలే తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ (బాలుర)లో నాల్స ( ప్రొటెక్షన్ అండ్ ఇన్ఫోర్స్మెంట్ ఆఫ్ ట్రైబల్ రైట్స్) స్కీం–2015పై న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వి. తరణి మాట్లాడుతూ భారత రాజ్యాంగం షెడ్యూల్డ్ కులాలు (ఎస్‌సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్‌టీ) ప్రజల సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధికి ప్రత్యేక రక్షణలు కల్పించిందని తెలిపారు. విద్యార్థులు తమ హక్కులతో పాటు బాధ్యతలను కూడా తెలుసుకోవాలని, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా సమాజంలో న్యాయం, సమానత్వం, సామాజిక సామరస్యాన్ని బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు.విద్యనే ఆయుధంగా చేసుకొని వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజాభివృద్ధికి కృషి చేయాలని, చట్టాన్ని గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి బాలబాలిక తప్పనిసరిగా పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని, చదువుకు దూరంగా ఉన్న పిల్లలను కూడా విద్యాభ్యాసంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. రమేష్‌బాబు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ ఎం. రవికుమార్, సిద్దిపేట–2 టౌన్ సీఐ ఎం. మురళి, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ సాజిద్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News