ముప్పై ఏళ్ల దర్గా రోడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం.. . అభివృద్ధి నిరోధకులను ప్రజలు తిరస్కరించాలి: ఎమ్మెల్యే నాయిని...

రూ.50 లక్షలతో సీసీ రోడ్డు, రూ.30 లక్షలతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని..

Published On
ముప్పై ఏళ్ల దర్గా రోడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం.. . అభివృద్ధి నిరోధకులను ప్రజలు తిరస్కరించాలి: ఎమ్మెల్యే నాయిని...

హనుమకొండ జిల్లా ప్రతినిధి,ఆగస్టు05
(లోకల్ గైడ్ న్యూస్):

విద్యుత్ ప్రమాద బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహార చెక్కు అందజేత,హనుమకొండ,  వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా 48వ డివిజన్ పరిధిలో గత మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కాజీపేట దర్గా రోడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి, రూ.50 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి  శంకుస్థాపన చేశారు. అనంతరం దర్గా ఉత్సవాల సమయంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.30 లక్షలతో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి .. శంకుస్థాపనల అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాజీపేట దర్గా రోడ్ సమస్య దశాబ్దాలుగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు. బోడగుట్ట, కడిపికొండ, ఇందిరానగర్ తదితర ప్రాంతాలకు వెళ్లే వేలాది మంది ప్రజలు ఈ రహదారిపై ఆధారపడుతున్నారని, గతంలో ఈ సమస్యపై అనేక ధర్నాలు, ఆందోళనలు, పోలీసు పికెటింగ్‌లు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. దర్గా పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో సమస్యకు పరిష్కారం లభించడం సంతోషకరమని అన్నారు. నెల రోజుల్లో రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన గడువు విధించినట్లు తెలిపారు.
అదేవిధంగా ఆర్‌ఈసీ రోడ్ నుంచి బయటకు వెళ్లే ప్రధాన రహదారి అభివృద్ధికి సుమారు రూ.20 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. ఆ ప్రతిపాదనలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని, ఎంపీ డాక్టర్ కావ్యతో పాటు సంబంధిత మంత్రులతో కూడా ఈ అంశంపై చర్చించినట్లు వెల్లడించారు.నియోజకవర్గంలో ప్రతి గల్లీలో రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతుల కల్పనతో ప్రజా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయితే అభివృద్ధిని చూసి ఓర్వలేని కొందరు ప్రతిపక్ష నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తాము తీసుకొచ్చిన అభివృద్ధి పనులపై కూడా నిరాధార ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు.
దర్గా రోడ్, కాజీపేట బస్టాండ్, రైల్వే ఓవర్ బ్రిడ్జి వంటి దశాబ్దాల సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే, కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న పనుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు.ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులు, పట్టణ మౌలిక వసతుల అభివృద్ధిని కూడా కొందరు కావాలనే అడ్డుకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రజల సంక్షేమం కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్న ఇలాంటి అభివృద్ధి నిరోధకులను ప్రజలు గుర్తించాలని పిలుపునిచ్చారు.
వరంగల్ నగరం అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, గత రెండున్నర సంవత్సరాల్లో అనేక కీలక సమస్యలకు పరిష్కారం చూపామని తెలిపారు. ముప్పై సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్న ప్రభుత్వం పనితీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అభివృద్ధిని అడ్డుకునే శక్తులను ప్రజలు తిరస్కరించి, అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ పెరగడం స్థానికంగా బీజేపీ, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ప్రజలను తప్పు ద్రోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.అనంతరం ఇటీవల విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన పోతురవేణ శివకుమార్ కుటుంబానికి అండగా నిలిచేందుకు విద్యుత్ శాఖ ద్వారా మంజూరైన రూ.5 లక్షల ఆర్థిక పరిహార చెక్కును ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాజీపేట దర్గా పీఠాధిపతి,రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ కుసుర్ పాషా,మాజీ కార్పొరేటర్లు సత్రాజ్ బేగం,అబూబకర్,జక్కుల రవీందర్,డివిజన్ అధ్యక్షులు రవి, నాయకులు అంకుష్,మట్టెడ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News