- District News
- ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదవాలి...
ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదవాలి...
ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీ
Published On
By Ram Reddy
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే విధంగా కష్టపడి చదవాలని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీ అన్నారు.హాజీపూర్ మండలం గుడిపేటలోని మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలను సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు,వసతులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించే దిశగా కష్టపడి చదవాలని,ప్రభుత్వ సేవలలో అవకాశాలు,పోటీ పరీక్షలకు క్రమశిక్షణతో సన్నద్ధం కావాలని తెలిపారు.విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి,క్రీడలలో పాల్గొని విద్యార్థులతో మాట్లాడి వారి భవిష్యత్తు లక్ష్యాల వివరాలను తెలుసుకొని పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో గురుకుల ప్రిన్సిపల్ శిరీష,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
06 Aug 2026 17:54:24
లోకల్ గైడ్ఆమనగల్లు, ఆగస్టు 6: మహాకవి, ప్రజా గాయకుడు, విప్లవ సాంస్కృతిక ఉద్యమకారుడు గద్దర్ శత జయంతి వేడుకలు గురువారం ఆమనగల్లు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ...
