- District News
- మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి చర్ల కాంగ్రెస్ శ్రేణుల ఘన నివాళి
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి చర్ల కాంగ్రెస్ శ్రేణుల ఘన నివాళి
Published On
By Ram Reddy
భారత మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను గురువారం చర్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ప శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కోట్లాది ప్రజల్లో ఆశలను నింపి, భారతదేశాన్ని 21వ శతాబ్దపు అవకాశాలకు సిద్ధం చేసిన దూరదృష్టిగల నాయకుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. భారత యువతపై ఆయనకు ఉన్న అచంచల విశ్వాసం, సాంకేతిక పురోగతిపై ఆయన చూపిన దూరదృష్టి, కొత్త ఆలోచనలను ప్రోత్సహించిన విధానం ఆయన వారసత్వాన్ని నేటికీ సజీవంగా ఉంచాయని పేర్కొన్నారు. దేశంలో సామరస్యం, సమైక్యత, సౌభ్రాతృత్వ స్ఫూర్తిని మరింత బలోపేతం చేయడమే రాజీవ్ గాంధీకి అందించే అర్థవంతమైన నివాళి అని అన్నారు. మేధో నైపుణ్యం, ఆవిష్కరణలు, యువత ఆకాంక్షలను ప్రోత్సహిస్తూ దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశ నిర్మాణానికి రాజీవ్ గాంధీ అందించిన అమూల్యమైన సేవలు, విశిష్టమైన కృషిని స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ప శ్రీనివాసరావు, చర్ల పీఏసీఎస్ చైర్మన్ పరుచూరి రవికుమార్, చర్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ పూజారి సామ్రాజ్యం, ఉపసర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు, సీనియర్ నాయకులు జవ్వాది రవి, ఎర్రెంకి ఉదయ ప్రభాకర్ రావు (బాబ్జి), మేడిచర్ల కుమార్, అలవాల మహేష్ నాయుడు (బాలు), సుందరి సురేష్, పటేల్ వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ ఎలకం నరేంద్ర, తోట మల్ల వరప్రసాద్, ఒళ్ళే శ్రీకాంత్, కాకర్ల కుమార్, వార్డు సభ్యురాలు కుక్కడపు రాజేశ్వరి, పాశిగంటి శ్రీదేవి, హబీబ్ ఖాన్, ఎస్సీ సెల్ నాయకులు చెన్నం రామ్మూర్తి, గొబ్బురి పూర్ణచందర్ రాజు, కణితి శ్రీనివాసరావు, పూనెం రాంబాబు, శ్యామల తరుణ్, లాయర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 20:45:39
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
