పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్,ఆపే కుట్రను సహించం: జోగు రామన్న

కోర్టు పరిణామాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి.. పేదల పక్షాన*

Published On
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్,ఆపే కుట్రను సహించం: జోగు రామన్న

అదిలాబాద్ జిల్లా లోకల్ గైడ్ ఆగస్టు 18
ఆదిలాబాద్: పేదింటి ఆడబిడ్డల వివాహానికి ఆర్థిక భరోసా కల్పిస్తూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను ఎలాంటి కారణాలతోనైనా నిలిపివేయడం దారుణమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నాయకుడు జోగు రామన్న మండిపడ్డారు. మంగళవారం అదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జోగు రామన్న గారి ఆధ్వర్యంలో  నిరసన దీక్ష కార్యక్రమాన్ని దాదాపు 3000 మంది  మహిళలతో పాటు బి ఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు . జిల్లా బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు బయట నుంచి నిరసన వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ రోడ్డు మార్గాన్ని దిగ్బంధించారు. వాహనాలను నిలిపేశారు.. అనంతరం జోగు రామన్న గారు మాట్లాడుతూ   ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తూ ప్రజల్లో ఆర్థిక సంక్షోభాన్ని ప్రోత్సస్తుందని   దుయ్యబట్టారు. హైడ్రా భూ కబ్జాలకు లాయర్లను పెట్టే కాంగ్రెస్ ప్రభుత్వం  కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎత్తివేస్తుంటే మంచి లాయర్లను పెట్టకుండా చోద్యం చూస్తూ తప్పించుకునే విత్తనాలు చేస్తుందని మండిపడ్డారు..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు కేవలం ప్రభుత్వ పథకాలు మాత్రమే కాదని, పేద కుటుంబాల్లో ఆడబిడ్డ పెళ్లి సమయంలో అండగా నిలిచే సామాజిక భరోసా అనిజోగు రామన్న అన్నారు. పేద కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్‌ ప్రభుత్వం ఈ పథకాలను ప్రవేశపెట్టి, దశలవారీగా ఆర్థిక సాయాన్ని పెంచిందని గుర్తుచేశారు.
ప్రస్తుతం ఈ పథకాల అమలుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువడిన నేపథ్యంలో పేద కుటుంబాల్లో ఆందోళన నెలకొందని జోగు రామన్న వేదన వ్యక్తం చేశారు..ప్రభుత్వం కోర్టులో తన వైఖరిని స్పష్టంగా వెల్లడించి, పథకాలు నిరాటంకంగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
“కోర్టును సాకుగా చూపించి పేదల సంక్షేమాన్ని పక్కన పెట్టొద్దు”కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో పేద ఆడబిడ్డల వివాహానికి మరింత ఆర్థిక భరోసా కల్పిస్తామని హామీలు ఇచ్చిందని, ఇప్పుడు పథకం అమలుపై అనిశ్చితి ఏర్పడటానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని జోగు రామన్న అన్నారు.
పథకానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను ప్రభుత్వం సమర్థవంతంగా కోర్టు ముందు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూనే, పేదలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే తన న్యాయపరమైన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
పేదింటి ఆడబిడ్డ పెళ్లి తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి పథకాన్ని బలహీనపరిచే ఏ ప్రయత్నాన్నీ బీఆర్‌ఎస్‌ సహించదని స్పష్టం చేశారు.
అవసరమైతే పేద కుటుంబాలు, మహిళల తరఫున ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని జోగు రామన్న హెచ్చరించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు కొనసాగి అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రయోజనం అందే వరకు బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. పేద మహిళలకు అండగా ఉండే మహోన్నత పథకాన్ని  కనుమరుగు చేసే యత్నం చేస్తే  పేదల పక్షం బి ఆర్ఎస్ పార్టీ నిరసన పోరాట కార్యక్రమాలను చేపట్టి  కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచేందుకు సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అజయ్, ఇజగిరి నారాయణ, సాజితోద్దీన్ యూనిస్ అక్బాని, స్వరూప రాణి, బోడగం మమత,పర్వీన్,గండ్రత్ రమేష్, సేవ్వా జగదీష్,వెనుగంటి ప్రకాష్, ఆత్రం వెంకటేష్, సలీమ్,అంజలి అనిల్,dr గౌష్,అన్నెలా వసంత్, ధర్మపాల్, బట్టు సతీష్, కరుణ, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మత్స్యకారుల సంక్షేమానికి కేంద్రం పెద్దపీట మత్స్యకారుల సంక్షేమానికి కేంద్రం పెద్దపీట
కేంద్ర ప్రభుత్వ అదనపు న్యాయవాది నందు 
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్,ఆపే కుట్రను సహించం: జోగు రామన్న
బాల్య వివాహాల రహిత జిల్లాగా సిద్దిపేటను తీర్చిదిద్దాలి: కలెక్టర్ కె. హైమావతి
సామాజిక సమానత్వం కోసం సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం. 
ప్రజా పాలన కాదు  ప్రతికార పాలన
సర్వాయి పాపన్న స్ఫూర్తితో కల్లుగీత కార్మిక హక్కులకై పోరాడుదాం.
గురుకులాన్ని ఏటూరునాగారం తరలించడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన... ఏ ఎన్ ఎస్ జిల్లా అధ్యక్షులు ఎట్టి విద్యాసాగర్..