సామాజిక సమానత్వం కోసం సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం. 

బడుగు–బలహీన వర్గాల హక్కుల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: జిల్లా అదనపు కలెక్టర్ 

డాక్టర్ కె. కిరణ్మయి
Published On
సామాజిక సమానత్వం కోసం సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం. 


     
     
 రంగారెడ్డి జిల్లా బ్యూరో, (లోకల్ గైడ్ ):                    సామాజిక సమానత్వం, బడుగు–బలహీన వర్గాల హక్కుల కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూIMG-20260818-WA0075 సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కె. కిరణ్మయి పిలుపునిచ్చారు.
 మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కె. కిరణ్మయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
         ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అణగారిన వర్గాల హక్కుల కోసం, సామాజిక సమానత్వం కోసం ధైర్యంగా పోరాడిన మహనీయుడని అన్నారు. అన్యాయం, దోపిడీ, అసమానతలకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలోని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆమె సూచించారు. సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు, హక్కులు లభించేలా కృషి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.
         సర్వాయి పాపన్న గౌడ్ జీవితం, ఆయన ఆశయాలు నేటి యువతకు ఆదర్శప్రాయమని పేర్కొంటూ, ఆయన చూపిన ధైర్యం, సామాజిక స్పృహ, సమానత్వ భావనలను నేటి తరానికి చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో సామరస్యం, సోదరభావం పెంపొందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
         ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి కేషురామ్, తెలంగాణ రాష్ట్ర బీసీ ఫ్రంట్ చైర్మన్ గొరిగే మల్లేష్ యాదవ్, టీపీసీసీ కార్యదర్శి శివకుమార్, కాంగ్రెస్ నాయకులు మంగమ్మ, రంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎగ్గిడి సత్తయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బండ ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి రవి గౌడ్, కసర మౌని కృష్ణ యాదవ్, శ్యామ శంకర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కౌన్సిలర్ సుధాకర్ గౌడ్, శ్రీశైలం గౌడ్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News