- District News
- గురుకులాన్ని ఏటూరునాగారం తరలించడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన... ఏ ఎన్ ఎస్ జిల్లా అధ్యక్షులు ఎట్టి విద్య...
గురుకులాన్ని ఏటూరునాగారం తరలించడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన... ఏ ఎన్ ఎస్ జిల్లా అధ్యక్షులు ఎట్టి విద్యాసాగర్..
ఏఐ యుగం లో కూడా అడవి బిడ్డలకు అందని నాణ్యమైన విద్య...
వాజేడు, లొకల్ గైడ్ ప్రతినిధి :-
వాజేడు మండల కేంద్రంలో ఏ ఎన్ ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షులు మోడెం నాగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిగా హాజరైన అధ్యక్షులు ఎట్టి విద్యాసాగర్ మాట్లాడుతూ వాజేడు వెంకటాపురం మండలాలు పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైనప్పటికీ ఒక్క గురుకుల కళాశాల కూడా లేదని ప్రభుత్వాలతో మొరపెట్టుకుంటే ఒక ట్రైబల్ వెల్ఫేర్ బాలికల జూనియర్ కళాశాల మంజూరు చేయడం జరిగినదని అన్నారు . కానీ ట్రైబల్ వెల్ఫేర్ బాలికల జూనియర్ కళాశాలకు భవనాలు కట్టకుండా ప్రభుత్వం కాలయాపన చేసిందని సాగర్ ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఆదివాసి పిల్లలకు విద్యను దూరం చేయలానే కుట్రలో భాగంగానే జరిగిందని విమర్శించారు.ఐటిడిఏ పి ఓ ఏజెన్సీ విద్యను బలోపేతం చేసే దిశగా దృష్టి పెట్టక పోవడం కారణామగానే ఏటూరునాగారం గురుకులం తరలించారు అన్నారు. నేటి పాలక ప్రభుత్వం వాజేడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గురుకుల కళాశాలను,విద్యార్ధుల తల్లిదండ్రులతో మీటింగ్ ఏర్పాటు చేయకుండానే రాత్రికిరాత్రే పిల్లలను ఏటూరునాగారం తరలించడం జరిగినదని అన్నారు. దీనిని ఆదివాసి నవనిర్మాణ సేనా తీవ్రంగా ఖండిస్తోంది అన్నారు. గురుకుల కళాశాలను తిరిగి తీసుకు రావాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఏటూరునాగారం లో ఇప్పటికే అన్నిరకాల విద్యావస్థలు ఉన్నప్పటికీ ఈ రెండు మండలాలకు సంబందించి గురుకుల కళాశాలను తరలించడం పట్ల తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేసారు. టెక్నాలజీ పెరిగి ప్రపంచం ఒక కుగ్రామం అయిందని, ఏఐ యుగం లో బ్రతుకుతున్న సమయంలో నాణ్యమైన విద్య కోసం వందల కిలోమీటర్లు వెళ్లాల్సి రావడం అన్యాయం అన్నారు. వేల కోట్ల గిరిజన సబ్ ప్లాన్ నిధులను వెచ్చించి నాలుగు ఏళ్ళు అవుతున్న పక్కా భవనం ఎందుకు కట్టలేదని అయన ప్రశ్నించారు. ఏజెన్సీ విద్య పైన నిజంగా ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే పక్కా భవనం కట్టేవారని అన్నారు.ఈ సమావేశంలో పాయం.విజయ్ కుమార్, తలడి ప్రసాద్ ,కణితి విజయ్ బొగ్గుల. దేవేందర్ పార్షిక. రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
