హుస్నాబాద్ నియోజకవర్గానికి భారీ వరం.. రోడ్లు, వంతెనల అభివృద్ధికి రూ.33.70 కోట్లు మంజూరు

28 అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతి.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు

Published On
హుస్నాబాద్ నియోజకవర్గానికి భారీ వరం.. రోడ్లు, వంతెనల అభివృద్ధికి రూ.33.70 కోట్లు మంజూరు

హనుమకొండ, ఆగస్టు 7(లోకల్ గైడ్):

హుస్నాబాద్ నియోజకవర్గంలో గ్రామీణ రహదారులు, వంతెనలు, క్రాస్ డ్రైనేజ్ పనుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.33.70 కోట్లతో 28 అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి (రోడ్లు) శాఖ జి.ఓ.ఆర్.టి. నెం.425 (తేదీ: 06-08-2026)ను జారీ చేసింది.ఈ నిధులతో సిద్ధిపేట, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల పరిధిలో వంతెనలు, క్రాస్ డ్రైనేజ్ పనులు, రిటైనింగ్ వాల్స్, హై లెవల్ బ్రిడ్జిలు, లో లెవల్ కాజ్‌వేలు, స్లాబ్ కల్వర్టుల నిర్మాణం చేపట్టనున్నారు.సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో 15 అభివృద్ధి పనులకు రూ.15 కోట్లు కేటాయించగా, హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో 5 పనులకు రూ.7.70 కోట్లు, కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో 8 పనులకు రూ.11 కోట్లు మంజూరు చేశారు.ఈ పనులు పూర్తయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు వర్షాకాలంలో ఎదురయ్యే రవాణా సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.హుస్నాబాద్ నియోజకవర్గానికి భారీగా నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సంబంధిత శాఖ మంత్రులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కృషితో ఈ నిధులు మంజూరయ్యాయని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News