మత్స్యకారుల సంక్షేమానికి కేంద్రం పెద్దపీట

మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా

కేంద్ర ప్రభుత్వ అదనపు న్యాయవాది నందు 
Published On
మత్స్యకారుల సంక్షేమానికి కేంద్రం పెద్దపీట

నారాయణపేట ఆగస్టు 18:
కేంద్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్ద పీట వేసిందని కేంద్ర ప్రభుత్వ అదనపు న్యాయవాది నందు నామాజీ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి  4,21, 767 మంది నమోదిత మత్స్య కారులకు గ్రూప్ ప్రమాద బీమా పథకం  అమలు చేయడానికి ఆమోదం తెలిపిందని తెలిపారు. మత్స్యకారు ల సంక్షేమం, జీవనోపాధి భద్రత, సామాజిక రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ప్రమా దవశా త్తు మరణం లేదా శాశ్వత వైకల్యానికి గురైన మత్స్య కారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ గ్రూప్ ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలి పారు.2026-27 సంవత్స రంలో 18 నుంచి 70 సంవ త్సరాల వయస్సు గల 4, 21,767 మంది నమోదిత మత్స్యకారులు ఈ పథకం పరిధిలోకి వస్తారని వెల్లడిం చారు. ఒక్కో లబ్ధిదారునికి రూ.79.96 బీమా ప్రీమియం ఉండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ప్రీమియం భరిస్తాయని తెలిపారు.ఈ పథకంతో మత్స్య కారుల కు ఎంతో ఉపయోగం కలుగుతుందని అన్నారు. 
ఈ బీమా పథకం ద్వారా
ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే 5 లక్షలు,శాశ్వత సంపూర్ణ వైకల్యానికి 5లక్ష లు,శాశ్వత పాక్షిక వైకల్యానికి 2.50 లక్షలు,    ప్రమాదవశాత్తు ఆసుప త్రిలో చికిత్స పొంది తే  గరిష్ఠంగారూ.25 వేల వరకు వైద్య సహాయం అందుతుందని తెలిపారు. ఈ పథకం 2026 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చే పాలసీ కాలంలో అర్హులైన ప్రతి నమోదిత మత్స్యకారుడికి నిరంతర బీమా రక్షణ అందేలా మత్స్యశాఖ అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు.
ఫోటో రైట్ అప్:5.నందు నామాజీ 
_____________________

Tags:

About The Author

Latest News

మత్స్యకారుల సంక్షేమానికి కేంద్రం పెద్దపీట మత్స్యకారుల సంక్షేమానికి కేంద్రం పెద్దపీట
కేంద్ర ప్రభుత్వ అదనపు న్యాయవాది నందు 
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్,ఆపే కుట్రను సహించం: జోగు రామన్న
బాల్య వివాహాల రహిత జిల్లాగా సిద్దిపేటను తీర్చిదిద్దాలి: కలెక్టర్ కె. హైమావతి
సామాజిక సమానత్వం కోసం సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం. 
ప్రజా పాలన కాదు  ప్రతికార పాలన
సర్వాయి పాపన్న స్ఫూర్తితో కల్లుగీత కార్మిక హక్కులకై పోరాడుదాం.
గురుకులాన్ని ఏటూరునాగారం తరలించడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన... ఏ ఎన్ ఎస్ జిల్లా అధ్యక్షులు ఎట్టి విద్యాసాగర్..