మీకు తోబుట్టువుగా..! నియోజకవర్గానికి పెద్దన్నగా .!! 

రాఖీ కట్టిన మహిళలకు అన్న కానుకగా  చీరలు బహుకరించిన ఎమ్మెల్యే..

Published On
మీకు తోబుట్టువుగా..! నియోజకవర్గానికి పెద్దన్నగా .!! 

IMG-20260828-WA0166వనపర్తి లోకల్ గైడ్ ప్రతినిధి ఆగస్ట్ 28:

రాఖీ పౌర్ణమి పర్వదినం  అన్న అక్క చెల్లెల అనుబంధానికి ప్రతీక..రాఖీ పండగ వచ్చిందంటే ఆడ పడుచులకు ఆనంధం . ఎక్కడ ఉన్న, ఎంత దూరంలో ఉన్న  రాఖీ పౌర్ణమి నాడు అన్ని పనులు వదులుకుని అక్క,  చెల్లెలు పుట్టింటి వారి ఇంటికి చేరు కుంటారు. అన్నదమ్ముల కు ఆనంద బాష్పాలు నిండిన నేత్రాలతో  రాఖీలు కట్టి ప్రేమానురాగాలను పంచుకుంటారు. పుట్టింటి వారు ఇచ్చే చిన్న కానుకలైన అభిమానం నిండిన ఆనందంతో స్వీకరిస్తారు. ఇది ప్రపంచం లోనే ఒక అరుదైన పండగ అని చెప్ప వచ్చు. శుక్రవారం ఈ సన్నివేశం వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో  కనువిందు చేసింది. వనపర్తి మున్సిపాల్ చైర్మేన్ తమ మహిళల కౌన్సిలర్లు,మరికొంత మంది మహిళమణులతో  క్యాంప్ ఆపీసులో ఉన్న ఎమ్మెల్యే మేఘారెడ్డి కి రాఖీలు కట్టి అన్న చెల్లెల అనుబంధాన్ని చాటుతూ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి రాఖీ కట్టిన మహిళలందరిని  ఆత్మీయంగా పలకరించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మహిళలం దరికీ చీరలను బహూకరించి తన సోదర ప్రేమను, ఆప్యాయతను పంచుకున్నారు.ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ రాఖీ అనేది కేవలం ఒక దారం కాదని, అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, నమ్మకం, భరోసా, బాధ్యతలకు ప్రతీక అన్నారు . మీరు నన్ను అన్నగా భావించి రాఖీ కట్టారని, ఇకపై నేను కూడా మిమ్మల్ని నా తోబుట్టువులుగా భావిస్తూ ఎల్లవేళలా మీకు అండగా ఉంటానన్నారు. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య ఎదురైనా సంకోచించకుండా నా దృష్టికి తీసుకరావాలని కోరారు. నియోజకవర్గంలోని ప్రతి మహిళకు తాను తోబుట్టువుగా, పెద్దన్నగా అండగా నిలుస్తానని ఆయన స్పష్టం చేశారు. మహిళల భద్రత, సంక్షేమం, గౌరవం, ఆత్మగౌరవానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజాప్రతినిధిగా తన బాధ్యతను నిర్వర్తిస్తానన్నారు . 
రాజకీయాలకు అతీతంగా ప్రజలతో కుటుంబ సభ్యుడిగా మమేకమై, వారి సుఖదుఃఖాల్లో భాగస్వామిగా ఉండటమే తన లక్ష్యమన్నారు.  నియోజకవర్గంలోని మహిళలు తనపై ఉంచిన నమ్మకాన్ని  ఇంటి పెద్దన్నగా నిలబెట్టుకుంటన్నారు . అదే విధంగా మహిళలు మాట్లాడుతూ ఎమ్మెల్యే మేఘారెడ్డి తమతో ఆప్యాయంగా మెలుగుతూ, తమ సమస్యలను సొంత కుటుంబ సభ్యుల సమస్యలుగా భావించి పరిష్కరించేందుకు ముందుండటం సంతోషంగా ఉందని తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే తమకు చీరలు బహూకరించడం మరింత ఆత్మీయతను కలిగించిందన్నారు .

Tags:

About The Author

Latest News

తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి
        మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు
జిల్లా పోలీస్ కార్యాలయంలో కాళోజి జయంతి వేడుకలు 
దళిత అసెంబ్లీ స్పీకర్ ని ఉద్దేశిస్తూ అవమానకరంగా,జుగుప్సాకరమైన పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు  పై చట్టప్రకారం ఖఠిన చర్యలు తీసుకోవాలి
_విద్యా విధానంలో యోగ–బ్రహ్మవిద్యకు స్థానం కల్పించాలి. _కేజీ నుంచి పీజీ వరకు యోగను పాఠ్యాంశంగా చేర్చాలి
నల్గొండ బస్‌స్టాండ్‌కు మోక్షం .
కాళోజీ అడుగుజాడల్లో నడవాలి: శిక్షణా సహాయ కలెక్టర్ పారస్ కుమార్
ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు గాదెపాడులో భారీ స్పందన