నిజామాబాద్ లో గవర్నర్ కు ఘన స్వాగతం

Published On
నిజామాబాద్ లో గవర్నర్ కు ఘన స్వాగతం

 

 నిజామాబాదు కు ఒక పర్యటనకు రాష్ట్ర గవర్నర్ సి.శివ్ ప్రతాప్ శుక్లా కు ఘన స్వాగతం లభించింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా నిజామాబాద్ కు చేరుకున్నారు. ఆయన వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్ హాజరయ్యారు. IMG-20260825-WA0303
       సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని హెలిప్యాడ్ వద్ద గవర్నర్ కు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ట్రైనీ కలెక్టర్ సురేష్ తదితరులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. 
     అక్కడి నుండి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ కాన్వాయ్ ద్వారా గవర్నర్ రోడ్లు భవనాల శాఖ అతిథి గృహానికి చేరుకోగా, పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.

అనంతతం జాతీయ పసుపు బోర్డు కార్యాలయానికి చేరుకున్నారు. జాతీయ, రాష్ట్ర గేయాలపన అనంతరం, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పసుపు రైతులతో భేటీ అయ్యారు. ఎం.పీ అరవింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేష్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, పసుపు బోర్డు చైర్మన్ పి.గంగారెడ్డి, సెక్రటరీ ఎన్.భవానీశ్రీ, డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యూష్ తదితరులతో కలిసి సునేహరి  మిట్టి అభియాన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

Tags:

About The Author

Latest News

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి: ఏ. శ్రీ దేవసేన అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి: ఏ. శ్రీ దేవసేన
    ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు చేపట్టాలని కమిషనర్‌ ఆఫ్‌ కాలేజియేట్‌
సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి.
ఇది ప్రజాస్వామ్యమా రాక్షస రాజ్యమా?
ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో ఐపీఎస్‌ విద్యార్థుల ప్రతిభ
జర్నలిస్టులపై కలెక్టర్ నిర్లక్ష్యం తగదు ఫీజు రాయితీ జీవో వెంటనే విడుదల చేయాలి
నాడు ఫ్రెండ్లీ పోలీసు... నేడు రేవంత్ పోలీసు
రైతు కుటుంబానికి స్థిరమై న ఆదాయం కల్పించేలా ప్రణాళికలురూపొందించాలి