- District News
- తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి
తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్లు పి చంద్రయ్య,వి రాములుతో కలిసి హాజరై కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతు తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమం ప్రతిధ్వనిగా కాళోజి తెలంగాణ ప్రజలందరికీ సుపరిచితులని అన్నారు.తెలంగాణ వైతాళికుడిగా ఆయన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని,తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమమే ఊపిరిగా చివరి శ్వాస వరకు జీవించాడని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం కాళోజీ జయంతి తెలంగాణ భాషా దినోత్సవంగా వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు.విద్యార్థి దశలోనే నిజాంను ఎదిరించి తెలంగాణలో విద్యా వ్యాప్తికి కృషి చేశారని,తన రచనలతో ప్రజలను చైతన్య పరుస్తు ఆదర్శంగా నిలిచారని అన్నారు.బహు బాషా కోవిదులు అని,కవిగా,రచయితగా తెలుగుతో పాటు వివిధ భాషలలో హ్యూమన్ రైట్స్,కుల వివక్ష లేని సమాజంపై రచనలు చేశారని తెలిపారు.మహనీయుల ఆశయాలను కొనసాగిస్తు ప్రజల సంక్షేమం,రాష్ట్ర అభివృద్ధి దిశగా అందరు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మోతిరాం,ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ,కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్ రావు దేశ్ పాండే,వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
