మరిపెడలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన

ఫిట్నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తప్పనిసరి.. నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలి

Published On
మరిపెడలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన

 లోకల్ గైడ్ 
మరిపెడ సెప్టెంబర్ 18 

మహబూబాబాద్ జిల్లా రవాణా అధికారి శంకర్ నాయక్ ఆదేశాల మేరకు మరిపెడ మండలంలో శుక్రవారం ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు రహదారి నిబంధనలు పాటిస్తూ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఆటోలను నడిపే సమయంలో చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్, ఇన్సూరెన్స్ తదితర ధ్రువపత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని అవగాహన కల్పించారు. వాహనానికి సంబంధించిన పత్రాలను ఎప్పటికప్పుడు సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు.

డ్రైవింగ్ చేస్తున్న సమయంలో సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకూడదని, అతివేగం, ఓవర్‌లోడింగ్‌కు దూరంగా ఉండాలని తెలిపారు. ప్రయాణికుల సామర్థ్యానికి మించి వ్యక్తులను ఎక్కించుకోకుండా నిబంధనలకు అనుగుణంగా ప్రయాణికులను మాత్రమే తీసుకెళ్లాలని సూచించారు.

అలాగే మద్యం సేవించి వాహనం నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. వాహనం బ్రేకులు, టైర్లు, లైట్లు తదితర ముఖ్యమైన భాగాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని, రాత్రివేళల్లో వాహన లైట్లు సక్రమంగా పనిచేస్తున్నాయో నిర్ధారించుకోవాలని తెలిపారు.

ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించడంతో పాటు, రహదారిపై ఇతర వాహనదారుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని ఆటోలను నడపాలని సూచించారు. ప్రతి డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు సహకరించాలని అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఖాసీం సాహెబ్, సహాయ మోటార్ వాహన తనిఖీ అధికారి, విజయ శాంతి, సహాయ మోటార్ వాహనాల తనిఖీ అధికారి పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయం.

Tags:

About The Author

Latest News

ఎన్కతల లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఎన్కతల లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
    మోమిన్‌పేట్, సెప్టెంబర్ 01 ( లోకల్ గైడ్ వికారాబాద్ జిల్లా బ్యూరో : మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో అర్హులైన పేదలందరికీ త్వరలోనే స్మార్ట్ రేషన్
ఫోన్ మోజులో వైద్యుల నిర్లక్ష్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పసిపాపల ప్రాణాలతో చెలగాటం
ఆమనగల్లు అభివృద్ధి కోసం ఆచారి ఆమరణ నిరాహార దీక్ష
విద్యార్థులకు సరిపడా బస్సు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు
ఫతుల్లాగూడ జంతు సంరక్షణ కేంద్రంలో కమిషనర్‌ పరిశీలన ఏబీసీ, యాంటీ రేబిస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలపై సమీక్ష
దళితుల,అభ్యున్నతి,సామాజిక రాజకీయ ,చైతన్యం కాంగ్రెస్ తోనే సాధ్యం.... షాద్ నగర్ నియోజక వర్గంలో ఎస్సీ, ఎస్టీలకు సముచిత స్థానం...
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన