వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన 

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Published On
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన 




కామారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్  1 లోకల్ గైడ్

కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని మౌలిక వసతులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల వద్ద షెడ్లు, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు.
రైతులకు ధాన్యం కొనుగోలు ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించేలా కొనుగోలు కేంద్రాల వద్ద సన్న రకం ధాన్యం నాణ్యతా ప్రమాణాలు, కొనుగోలు విధానం, ఫిర్యాదుల పరిష్కారం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లతో కూడిన ఫ్లెక్సీలను స్పష్టంగా ప్రదర్శించాలని తెలిపారు.
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం 48 గంటల్లోపు రైతుల బ్యాంకు ఖాతాల్లో చెల్లింపులు జరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా, పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి ఇప్పటికే అవసరమైన శిక్షణ అందించామని అధికారులు జిల్లా కలెక్టర్‌కు వివరించారు. కొనుగోలు ప్రక్రియ, నాణ్యతా ప్రమాణాలు, ఆన్‌లైన్ నమోదు తదితర అంశాలపై సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించినట్లు తెలిపారు.
జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు, పరికరాలు, ఇతర ఏర్పాట్లను ముందుగానే సిద్ధం చేసుకుని రైతులకు సక్రమమైన, పారదర్శకమైన కొనుగోలు సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా శుభ్రపరిచి, తేమ లేకుండా ఆరబెట్టి, సంబంధిత ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ కొనుగోలు సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యంత్రాంగం కోరింది.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్,   జిల్లా సహకార అధికారి రామ్మోహన్, పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, ప్రత్యేక అధికారి శ్రీధర్ రెడ్డి, తహసీల్దార్ హిమబిందు, ఎంపీడీవో హెప్సిబా రాణి, కామారెడ్డి సింగరేణి చైర్మన్ గూడెం శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ చింతల దివ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఎన్కతల లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఎన్కతల లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
    మోమిన్‌పేట్, సెప్టెంబర్ 01 ( లోకల్ గైడ్ వికారాబాద్ జిల్లా బ్యూరో : మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో అర్హులైన పేదలందరికీ త్వరలోనే స్మార్ట్ రేషన్
ఫోన్ మోజులో వైద్యుల నిర్లక్ష్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పసిపాపల ప్రాణాలతో చెలగాటం
ఆమనగల్లు అభివృద్ధి కోసం ఆచారి ఆమరణ నిరాహార దీక్ష
విద్యార్థులకు సరిపడా బస్సు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు
ఫతుల్లాగూడ జంతు సంరక్షణ కేంద్రంలో కమిషనర్‌ పరిశీలన ఏబీసీ, యాంటీ రేబిస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలపై సమీక్ష
దళితుల,అభ్యున్నతి,సామాజిక రాజకీయ ,చైతన్యం కాంగ్రెస్ తోనే సాధ్యం.... షాద్ నగర్ నియోజక వర్గంలో ఎస్సీ, ఎస్టీలకు సముచిత స్థానం...
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన