ఆమనగల్లు అభివృద్ధి కోసం ఆచారి ఆమరణ నిరాహార దీక్ష

చిరు వ్యాపారుల హక్కుల పరిరక్షణతో పాటు మౌలిక వసతుల కల్పనే ప్రధాన డిమాండ్లు

Published On
ఆమనగల్లు అభివృద్ధి కోసం ఆచారి ఆమరణ నిరాహార దీక్ష

 

లోకల్ గైడ్ ఆమనగల్లు, అక్టోబర్ 1:

ఆమనగల్లు పట్టణ సమగ్ర అభివృద్ధి, చిరు వ్యాపారుల జీవనోపాధి పరిరక్షణ లక్ష్యంగా మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 5, 6, 7 తేదీల్లో ఆమనగల్లు గాంధీ చౌక్‌ చౌరస్తా వేదికగా దీక్ష చేపట్టనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
చిరు వ్యాపారుల హక్కుల పరిరక్షణ, వారి ఉపాధి అవకాశాలను కాపాడటం, పట్టణంలో మౌలిక వసతుల కల్పనతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే దీక్ష ప్రధాన ఉద్దేశమని తెలిపారు. దీక్షకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ పోరాటంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. చిరు వ్యాపారులు, వివిధ వ్యాపార సంఘాల ప్రతినిధులు దీక్షకు సంపూర్ణ మద్దతు తెలిపి, సమస్యల పరిష్కారం కోసం తమ గళాన్ని వినిపించాలని కోరారు.
పట్టణాభివృద్ధి విషయంలో పాలకుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ శాంతియుత మార్గంలో ప్రజా పోరాటం కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. “మన ఊరు–మన బాధ్యత” అనే నినాదంతో ఆమనగల్లు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని వారు విజ్ఞప్తి చేశారు.

Tags:

About The Author

Latest News

ఎన్కతల లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఎన్కతల లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
    మోమిన్‌పేట్, సెప్టెంబర్ 01 ( లోకల్ గైడ్ వికారాబాద్ జిల్లా బ్యూరో : మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో అర్హులైన పేదలందరికీ త్వరలోనే స్మార్ట్ రేషన్
ఫోన్ మోజులో వైద్యుల నిర్లక్ష్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పసిపాపల ప్రాణాలతో చెలగాటం
ఆమనగల్లు అభివృద్ధి కోసం ఆచారి ఆమరణ నిరాహార దీక్ష
విద్యార్థులకు సరిపడా బస్సు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు
ఫతుల్లాగూడ జంతు సంరక్షణ కేంద్రంలో కమిషనర్‌ పరిశీలన ఏబీసీ, యాంటీ రేబిస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలపై సమీక్ష
దళితుల,అభ్యున్నతి,సామాజిక రాజకీయ ,చైతన్యం కాంగ్రెస్ తోనే సాధ్యం.... షాద్ నగర్ నియోజక వర్గంలో ఎస్సీ, ఎస్టీలకు సముచిత స్థానం...
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన