- District News
- భద్రతపై అవగాహన.. చట్టాలపై చైతన్యం.* - షీ టీమ్స్, టి సేఫ్ యాప్, 112, 1930పై విద్యార్థులకు అవగాహన
భద్రతపై అవగాహన.. చట్టాలపై చైతన్యం.* - షీ టీమ్స్, టి సేఫ్ యాప్, 112, 1930పై విద్యార్థులకు అవగాహన
- షీ టీమ్ ఇన్‌చార్జ్ ఏఎస్ఐ నారాయణ
లోకల్ గైడ్/పెద్దేముల్:
మహిళలు, బాలికల భద్రతతో పాటు విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని షీ టీమ్ ఇన్‌చార్జ్ ఏఎస్ఐ నారాయణ సూచించారు. గురువారం పెద్దేముల్ మండలం ఘాజీపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు భద్రత, చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ మేరకు, షీ టీమ్స్ ప్రాధాన్యత, ట్‌సేఫ్ యాప్, అత్యవసర సమయంలో 112 నంబర్‌ను వినియోగించుకోవడం, సైబర్ నేరాలకు గురైతే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయడం గురించి వివరించారు. అలాగే పోక్సో చట్టం, యాంటీ డ్రగ్స్, యాంటీ ర్యాగింగ్ చట్టాలు, ట్రాఫిక్ నిబంధనలు, మహిళల భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా పోలీసుల సహాయం పొందాలని ఏఎస్ఐ నారాయణ సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయా సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
