విద్యార్థుల సంక్షేమానికి సర్పంచ్ టోనీ అండ

సింగరేణి పాఠశాల విద్యార్థులకు షూ, యూనిఫాంల పంపిణీ

Published On
విద్యార్థుల సంక్షేమానికి సర్పంచ్ టోనీ అండ

 

 

కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 10, లోకల్ గైడ్ :

సింగరేణి ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు గ్రామ సర్పంచ్ మేదరి వీర ప్రతాప్ (టోనీ) చేతుల మీదుగా షూ, యూనిఫాంలను పంపిణీ చేశారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలుస్తున్న సర్పంచ్ టోనీని ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ టోనీ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగిIMG-20260910-WA0272 తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందేలా చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, వైరా ఎమ్మెల్యే రామదాసు నాయక్ సహకారంతో సింగరేణి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. విద్యార్థుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని సర్పంచ్ టోనీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం  వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం 
        మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) సామాజిక అన్యాయాలు,దోపిడీ,అణచివేతను ఎదిరించి చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
వినాయక చవితి పండుగను నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో  జరుపుకోవాలి 
భద్రతపై అవగాహన.. చట్టాలపై చైతన్యం.* - షీ టీమ్స్‌, టి సేఫ్‌ యాప్‌, 112, 1930పై విద్యార్థులకు అవగాహన
చట్టాలపై అవగాహనతో హక్కుల పరిరక్షణ.
క్లెయిమ్స్,అభ్యంతరాల స్వీకరణకు,తుది జాబితా గడువు పెంపు
ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగ,ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
విద్యార్థుల సంక్షేమానికి సర్పంచ్ టోనీ అండ